తేల్చిచెప్పిన కేంద్ర సర్కారు..
న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందు కు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సెషన్స్‌లో కేంద్రం ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. పార్లమెంటు సభ్యుడు సజ్జా అహ్మద్ తదితరులు అడిగిన ప్రశ్నపై కేంద్రం ఈ విధంగా స్పందించింది. స్టీల్ ప్లాంటులో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు ఆ సంస్థతో సంబంధం ఉన్న అందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇలావుంటే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జంతర్‌మంత్ వద్ద కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. ‘మోడీ హటావొ.. దేశ్ బచావొ’ (మోడీని తప్పించండి.. దేశాన్ని రక్షించండి), ‘వైజాగ్ ప్లాంట్‌ను రక్షించండి’ అని రాసివున్న బ్యానర్లను ప్రదర్శించారు. భారీ వర్షంలోనూ కార్మికులు తమ నిరసనను కొనసాగించడం విశేషం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రెండు రోజుల ధర్నా చేపట్టిన కార్మికులు డిమాండ్ చేశారు. లభాల్లో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగానే జోరుగా ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఒక భారీ కుట్రగా వారు అభివర్ణించారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న ఈ కర్మాగారాన్ని ఒక్క పెన్నుపోటుతో ఎలా ప్రైవేటీకరిస్తారని నిలదీశారు. ప్లాంట్‌కు ఉన్న 22 కోట్ల రూపాయల రుణాలను ఈక్విటీ వాటాలుగా మార్చాలని సూచించారు. అదే విధంగా ప్లాంటుకు సొంతంగా గనులను కేటాయిచాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
కేసు వాయిదా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వారాలు వాయిదావేసింది. సోమవారం ఈ పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. స్టీల్ ప్లాంట్ తరఫున కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనులు మంత్రిత్వ శాఖలు కౌంటర్‌ను దాఖలు చేయాలని కోర్టు ఇది వరకే చేసిన సూచపై కేంద్ర సర్కారు తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, గతంలో ఆర్థిక శాఖ తరఫున వేసిన కౌంటరే అన్ని కేసులకూ వర్తిస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో వివరించాల్సిందిగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆ ప్లాంట్‌తో సంబంధం ఉన్న వారి అభిప్రాయాలను ఎందుకు స్వీకరించలేదని అడిగారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దాఖు చేసిన కౌంటర్‌ను పరిశీలించి,రిజాయిండర్ వేసేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ,. కేసును వాయిదా వేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు
RELATED ARTICLES