ప్రజాపక్షం/హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోడీ ఐదేళ్ల పాలనలో విభజన చట్టంలో పే ర్కొన్న హామీలను అమలు చేయాలని, దీనిపై ఒత్తిడి తీసుకురావడంతో టిఆర్‌ఎస్ ఎం పిలు విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్ర చివరి బడ్జెట్ సమావేశాలు ముగిసినా తెలుగు రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ కనబర్చిందని విమర్శించారు. మఖ్దూం భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అ మలు కోసం ప్రతిపక్షాలు పోరాడుతున్నా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తెలంగా ణ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్షాలు కోరినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపిలు కూడా విభజన హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ ప్రాజెక్టుగా కాళేశ్వరం, కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, గిరిజన యూనివర్శిటీ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు తదితర హామీల్లో ఒక్కటీ నేరవేరలేదన్నారు. బిజెపి ప్రభుత్వానికి అన్నింటా పూర్తి సహకారాన్ని అందించిన టిఆర్‌ఎస్ ఏ ఒ క్కటి సాధించలేకపోయిందని తెలంగాణ ఉద్యమంలా విభజన హామీల అమలుకు అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమించడంలో, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్ర భుత్వం విఫలమయ్యిందని చాడ అన్నారు. ము ఖ్యమంత్రి ప్రతిపక్షాలు లేని తెలంగాణ కోరుకుంటున్నట్లుంది తప్ప ప్రజాస్వా మ్య తెలంగాణ కాదని, ప్రతిపక్షాలు బలహీనపడడం, బలపడడం అనేది జరుగుతూనే ఉం టుందన్నారు. ముఖ్యమంత్రి అహంకారంతో వ్యవహరించడం మాని ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో వడ్రంగి వృత్తిపై ఆంక్షలు విధించడాన్ని చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. పోడు సాగుదారులపై దాడులు చేసి పంటలు ధ్వంసం చేశారని, ఇప్పుడు వడ్రంగులు పోలీసుల వేధింపుల మధ్య బతికీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా వృత్తులు చేసుకునే వారు పనిచేయకుండా ముఖ్యమంత్రికి ‘జీ హుజూర్’ అని బతకా లా అని ప్రశ్నించారు. కలప దొంగలను వదిలేసి వడ్రంగులపై కేసులు పెట్టడాన్ని ఆయ న తీవ్రంగా ఖండించారు. వడ్రంగులకు అండ గా ఉంటామని, వారి పక్షాన నిలబడి పోరాడతామన్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం
పార్లమెంటు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరచడానికి నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట రెడ్డి ప్రకటించారు. 19న భవనగిరి, 20న మహబూబాబాద్, 25న ఖమ్మం, 26న నల్గొండ పార్లమెంటు నియోజవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర, వామ పక్షాలను కలుపుకొని ముందు కు పోతామన్నారు. బిఎల్‌ఎఫ్‌ను కాదని సిపిఐ(ఎం) ముం దుకు వస్తే ఆ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అభ్యంతరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పనున్నారని చాడ అన్నారు.
విభజన హామీల సాధనలో టిఆర్‌ఎస్ ఎంపిలు విఫలం
RELATED ARTICLES