న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. టిఎంసి నేతృత్వంలోని కొంతమంది ప్రతిపక్ష ఎంపిలు రాజ్యసభ చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చి, వ్యవసాయ బిల్లు ప్రతులను చించేసి డిప్యూటీ చైర్మన్‌పైకి విసిరా రు. ఆయన వద్ద మైకు లాగేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సభా సమయం ముగియడంతో వ్యవసాయ బిల్లులపై వ్యవసాయశాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానాన్ని సోమవారాకి వాయిదా వేయాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేయగా, వారి విజ్ఞప్తులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ త్రోసిపుచ్చారు. భద్ర త కోసం బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, సిపిఎం సభ్యుల తీర్మానాన్ని హరివంశ్ తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులయు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అదే సమయంలో బిల్లుల ఆమోదానికి క్లాస్‌బై క్లాస్ ఓటింగ్ కోసం చైర్మన్ సిద్ధం కాగా, డెరెక్ ఓబ్రయిన్ సహా కొంత మంది ప్రతిపక్ష సభ్యులు నిబంధనల బుక్‌ను హరివంశ్‌కు చూపించారు. మరికొంత మంది కొన్ని అధికారిక పత్రాలను చింపి చైర్మన్‌పై విసిరివేశారు. సభ్యులు నినాదాలు చేస్తూనే చైర్మన్ వద్ద ఉన్న మైక్‌లను విరగ్గొట్టేందుకు ప్రయత్నించగా, రాజ్యసభ సిబ్బంది అడ్డుకున్నారు. దీంత సభను కొద్దిసేపు డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశం కాగానే మళ్లీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుల పాస్ అయినట్లు హరివంశ్ ప్రకటించారు.
విపక్షాల గందరగోళం
RELATED ARTICLES