పోటీపడి వీక్షించిన జనం
తెలుగు రాష్ట్రాల్లో పాక్షికం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో మంగళవారం సాయంత్రం సూర్యగ్రహణం ఏర్పడింది. వినువీధిలో కనువిందు చేసింది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. భారత్‌లో మాత్రం పాక్షకికంగా కనిపించింది. పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశా రు. సాయంత్రం 4.29 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. 6.26 గంటల వరకు కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే చాలా ఏండ్ల వరకు ఇలాంటి గ్రహ ణం మళ్లీ కనిపించదట. భారత
సూర్యగ్రహణం కనువిందుదేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మంగళవారం నాటి గ్రహణం భారత్‌లోని జైపూర్, నాగ్‌పూర్, ద్వారక, చెన్నై, ముంబయి, కోల్‌కతా తదితర నగరాల్లో కనిపించింది. హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్‌కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబయిలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్‌పూర్‌లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో సూర్యగ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 25ఏళ్ల తర్వాత దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడిందని, ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ఇందుకోసం రెండు భారీ టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లో నిల్చొని ఒక్కొక్కరు టెలిస్కోప్ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. టెలిస్కోప్‌ను ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి తెరపైనా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరికొందరు బ్లాక్ కలర్ ఫిల్మ్ ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణం అంటే ఏమిటి? గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి? అనే విషయాలపై ఈ సందర్భంగా బిర్లా ప్లానిటోరియం సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెలిస్కోప్ ద్వారా నేరుగా సూర్య గ్రహణం వీక్షించడం కొత్త అనుభూతినిచ్చిందని పలువురు ఔత్సాహికులు తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించనున్నారు. గ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించి జపాలు, గ్రహణ దోష నివారణ పూజలు చేశారు.
వినువీధిలో.. సూర్యగ్రహణం కనువిందు
RELATED ARTICLES