మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 24న కానీ.. 27న కానీ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో వైభవంగా నిర్వహించేందకు ఈ చిత్ర బృందం సిద్ధమవుదోంది. ఈ చిత్ర వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, జూనియర్ ఎన్టిఆర్ హాజరుకానున్నారనే విషయం మనకు తెలిసిందే. కానీ వీరిద్దరితో పాటు మరో అతిథి కూడా హాజరుకానున్నారని టాక్ నడుస్తోంది. ఆయనే కెటిఆర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. నేడు(శుక్రవారం) ఈషా గుప్తాతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన పబ్ సెట్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 11న విడుదల చేసేందకు సన్నహాలు జరుగుతున్నాయి.
‘వినయ విధేయ రామ’ ఫంక్షన్‌కు కెటిఆర్
RELATED ARTICLES