‘ప్రజాపక్షం’ ఇంటర్వ్యూలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రాథమిక విద్యా వ్యవస్థలో విద్యా ప్రమాణాలను పెంచడమే మా ప్రభుత్వం ముందున్న సవాల్ అని నూతన విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా, ఏదేశంతో నైనా పోటీ పడేలా అంతటి ప్రమాణాలతో మన పిల్లలు తయారు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గురుకుల పాఠశాలలో ఏవిద్యను అందిస్తున్నారో అదే విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని సిఎం కెసిఆర్ చెబుతూ వస్తున్నారని, సిఎం ఆలోచన విధానానికి అనుగుణంగా పని చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలను తీసుకున్న అనంతరం ప్రజాపక్షం ఆయన్ను సచివాలయంలో కలిసి ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..
ప్రశ్న : తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా మీ ముందున్న లక్ష్యాలు ఏమిటి?
మంత్రి జగదీశ్ రెడ్డి : ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని భావిస్తున్నాం. పిల్లలు కళాశాలల అయిపోయిన తర్వాత మళ్లీ క్రాస్ రోడ్‌లో నిలబడవద్దు, ఉన్నత విద్యను ఒక తరానికి అందించగలిగే స్థాయిలో మన పిల్లలకు అందిస్తే భవిష్యత్తులో విద్యా రంగంలో తెలంగాణ ను ఎవరూ మించిపోలేరు. ఆ దిశగానే సిఎం కెసిఆర్ తెలంగాణలో కెజి టు పిజి విద్యను ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ఈ పథకం అమలులోకి కూడా వచ్చింది.
ప్రశ్న : ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పటికి మీరు గమనించిన తేడా?
మంత్రి : సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా వి ద్యను అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ప్రభుత్వ గు రుకుల పాఠశాలల్లో అడ్మీషన్ల కోసం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో మెడికల్ సీటు కోసమో, ఫలా నా ప్రైవేటు స్కూలులో అడ్మీషన్ కావాలనో ప్రజాప్రతినిధుల వద్దకు తల్లిదండ్రులు వచ్చే వారు. అలాంటి ఫైరవీ లు ఇప్పుడు మాకు అవసరమే రావడం లేదు. ఒక రకం గా ఇది శుభ పరిణామం, ప్రభుత్వం చర్చలు సత్పలితాలను ఇస్తున్నాయనడానికి ఇది నిదర్శనం కూడా.
ప్రశ్న : ఇరిగేషన్ తదితర రంగాలతో పోలిస్తే విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్య తగ్గినట్లుంది?
మంత్రి : విద్యా రంగానికి నిధులు తగ్గితే ప్రాధాన్యత తగ్గినట్లు కాదు.. ఆర్ అండ్ బి శాఖకు కేటాయించిన నిధు ల్లో ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా వినియోగిస్తున్నాం. ఇది విద్యా రంగం కిందికి రాదా? విద్య జాతికి మూలం. విద్యాను మరింత పటిష్టపరి చేందుకు సిఎం ప్రణాళికలను రూపొందించారు. తమ ప్ర భుత్వం తొలి సారిగా అధికారం చేపట్టినప్పుడు తెలంగా ణ అభివృద్ధి, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిం ది. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ సారి విద్యా, వైద్య రం గాలకు ప్రాధాన్యతనిస్తామని స్వయంగా కెసిఆర్ చెప్పడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. ఈ దిశగా తె లంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లోని ప్రతి మండలంలో కనీ సం ఒకటి ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తాం.
ప్రశ్న : పాఠశాల స్థాయి నుంచి ప్రమాణాలు పెంచుతామంటున్నారు.. ఎలా?
మంత్రి : ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సిల అభిప్రాయాలను తీసుకుంటాం. రానున్న రోజుల్లో ప్రాథమిక విద్యా ప్రమాణాల పెంపు ఎలా అన్నది చర్చిస్తాం. ప్రమాణాలు పెంచాలని ఏ ఒక్కరో అనుకుంటే అయ్యే పని కాదు. సమిష్టిగా అందరమూ బాధ్యతగా తీసుకోవాలి. ఫలితాలు మంచిగా వచ్చినా, రాకున్నా బాధ్యత కూడా అం దరిదే.
ప్రశ్న : విద్యా రంగంలో ఏమైనా మార్పులు ఉంటాయా?
మంత్రి : మూస విధానంలో విద్యా బోధనలు, అటు పిల్లలు చదివామా? పాస్ అయ్యామా? అన్నట్లు ఉంటున్నారు. మనకు కావాల్సింది అది కాదు. విద్య జీవితానికి వెలుగు నిస్తూనే వారి ఉపాధిని కల్పించాలి. అదే మంచి విద్య అన్నది నా ఉద్దేశం. బడ్జెట్లో కేటాయింపులు కూడా ఈ సారి పెరగనున్నాయి. సమైక్య పాలనలో స్కూల్ భవనాలు, మూత్ర శాలలు, మంచి నీటి వసతిని కూడా తీర్చలేక పోయారు.
తెలంగాణలో ఇప్పటికే అవన్ని సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం. నాపై నమ్మకంతోనే విద్యాశాఖను మరో సారి అప్పగించారు. గత అనుభవాలను గమనంలో ఉంచుకుని ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంను విద్యాశాఖ పరంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాను. తన పైనా, విద్యాశాఖపైనా సిఎం కెసిఆర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.