వీడియోను విడుదల చేసిన జామియా కమిటీ
జామియా మిల్లియా ఇస్లామియా వర్సిటీలో డిసెంబర్ 15న విద్యార్థులపై దాడి ఘటన వీడియో వైరల్
న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 15న విద్యార్థులపై లై బ్రరీలో పోలీసుల దాడి జరిగింది. అయితే దాదాపు రెండు నెలలు గడిచాక దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కర్రలతో కొడుతున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ వీడియోను జామియా సమన్వయ కమిటీ విడుదలచేసింది. ఈ కమిటీ జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో కూడుకున్నది. జామియా క్యాంపస్‌లో పోలీసుల దాడి తర్వాత ఈ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా అనేక మంది రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. 48 సెకండ్ల సిసిటివి ఫుటేజ్‌లో ఏడెనిమిది మంది పారామిలిటరీ, పోలీసు సిబ్బంది ఓల్డ్ రీడిగ్ హాల్‌లోకి ప్రవేశించి విద్యార్థులను కర్రలతో బాదడం కనిపించింది. వారు తమ ముఖాలను హ్యాండ్ కర్చీఫ్‌లతో కప్పుకున్న దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం బయట కొన్ని మీటర్ల దూరంలో జరిగిన విధ్వంసకాండ, దహనకాండ ఘటనల్లో విద్యార్థులు ఉండడంతో పోలీసులు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలోకి జొరబడి వారిని బాదినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టయిన వీడియో తమ దృష్టికి కూడా వచ్చిందని, దర్యాప్తులో భాగంగా దానిపై కూడా దర్యాప్తు జరుపుతామని ప్రత్యేక పోలీస్ కమిషనర్(ఇంటెలిజెన్స్) తెలిపారు. కాగా ఆ వీడియో తమకు ‘అజ్ఞాత వర్గం’ నుంచి అందిందని జామియా సమన్వయ కమిటీ తెలిపింది. లైబ్రరీలో పోలీసుల దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి)తో కూడా వీడియో ఫుటేజ్‌ను పంచుకున్నట్లు యూనివర్శిటీ తెలిపింది. వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ టిట్టర్‌లో షేర్ చేస్తూ ‘వీడియో వెలుగు చూశాక కూడా ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోకపోతే అప్పుడు అది ప్రభుత్వ ఉద్దేశాలను బట్టబయలు చేయగలదు’ అని వ్యాఖ్యానించారు.
విద్యార్థులపై దాడి చేసింది పోలీసులే..!
RELATED ARTICLES