చైనీస్ ఫుడ్ ఆరగిస్తూ పలు సామాజిక సమస్యలపై చర్చ
రాహుల్ మాటల్లో నిజాయితీ వుందన్న విద్యార్థులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏడుగురు విద్యార్థులతో కలిసి విందు చేసి అ ందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ ఏడుగురు యువ విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చెందినవారు. లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ ‘అప్నీ బాత్ రాహుల్‌కే సాత్’ పేరుతో ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ఈ ఏడుగురు వి ద్యార్థులతో కలిసి భోజనం చేయడంతోపాటు పలు అంశాలపై ముచ్చటించారు. ఈ భేటీలో అందరూ చైనీస్ ఫుడ్ ఆరగించారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి కొన్ని ఆలో చనలను కూడా రాహుల్ వారి నుంచి సేకరించారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రజలకు ఏ మేమి హామీలు ఇచ్చారో తెలియజేశారు. బ్రెయిలీ లిపిలో మ్యానిఫెస్టోను ముద్రించిన విష యాన్ని గుర్తుచేశారు. విద్యావ్యవస్థలో అసమానతలను తొలగించడానికి లింగతటస్థ మరు గుదొడ్ల ఏర్పాటుతోపాటు సమాజంలో కుల వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకు ంటున్నామని రాహుల్‌గాంధీ చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో ఈ ‘భేటీ’ జరిగింది. ఇ లాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించనున్నట్లు రాహుల్ చెప్పారు. తరచూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా తాను చేసిన విమర్శలను మరోసారి వారి వద్ద చేసి చూపించి, నవ్వులు పూయించారు. మన్‌కీబాత్ తరహాలో పరీక్షాపే చర్చా పేరుతో పది, పన్నెండు తర గతుల విద్యార్థులతో మోడీ జరిపిన సమావేశాలపై కూడా జోకులు విన్పించారు. అయితే రా హుల్, విద్యార్థుల భేటీలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ప్రస్తావనకు రావడం గమ నా ర్హం. రాహుల్ సంభాషణలో ఎంతో నిజాయితీ కన్పించిందని భేటీ అనంతరం ఢిల్లీ యూ నివర్శిటీ విద్యార్థి ప్రతిష్ఠ దేవేశ్వర్ చెప్పారు. ఈ విద్యార్థుల్లో ఒక ఎల్‌జిబిటిక్యూ కార్యకర్త కూడా వున్నారు. ఆ విద్యార్థి కాలేజీల్లో లింగతటస్థ మరుగుదొడ్లను నిర్మించాలని రాహుల్‌కు సలహా ఇవ్వగా, ఆయన అందుకు అంగీకరించారు. తమ భేటీ ఎంతో ఆహ్లాదకరంగా జరిగిందని ముంబయి ఐఐటి విద్యార్థి అభిలాష్ కర్రి చెప్పారు. కులవివక్ష నిర్మూలనపై అడిగిన ప్రశ్న సందర్భంగా రాహుల్ చెప్పిన పలు విషయాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా వున్నాయని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) విద్యార్థి కునాల్ రామ్‌తెకే తెలిపారు. విద్యావ్యవస్థ ప్రక్షాళన జరగాలని, కానీ అది ఏ ఒక్క సిద్ధాంతం ఆధారంగా జరగకూడదని రాహుల్ అన్నట్లు అతను తెలిపారు.
విద్యార్థులతో రాహుల్ ముచ్చట!
RELATED ARTICLES