ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థులందరికీ కాంగ్రెస్ పార్టీ దన్నుగా ఉంటుందని, విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందుకుండా వారిని వెనక్కు లాగేస్తు న్న అవినీతిని అంతమొందిస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన దేశంలోని విద్యార్థులందరికీ బహిరంగ లేఖను రాశారు. ఈ సందర్భంగా రాహుల్ విద్యార్థులను జాతి నిర్మాతలుగా అభివర్ణించారు. దేశాలు తప్పుడు విధానాలతో ముందుకు పోలేవు. కానీ, శాస్త్రీయ, టెక్నాలజి, సాహిత్య రంగాల ప్రగతితో ముందుకు వెళ్లగలవు. దేశం లోని విద్యార్థుల సమానత్వం కోసం కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగానే తమ పార్టీ ఓ ఎ జెండాతో ముందుకు వెళుతోంది. బెహతర్ భారత్(బెటర్ ఇండియా)నిర్మించాలనేదే కాంగ్రెస్ లక్ష్యం. అందుకే విద్యార్థుల కోసం ఈ లేఖను రా శా. తాను రాసిన లేఖను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నేతలు దేశంలోని అన్ని కళాశాలకు పంపిణి చేస్తారు. హేతుబద్ధ, సమాన న్యాయం చేయడంలో భారత దేశంలోని విద్యార్థులే అగ్ర భాగంలో ఉన్నారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో విద్యార్థులు పలు సమస్యలను ఎదుర్కోంటున్నారు. తక్కువ సీట్లు, అధిక ఫీజులు, అత్యధిక పోటీ వంటి అంశాలతో విద్యార్థులు ఇ బ్బందులు పడుతున్నారు. విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సి ద్ధంగా ఉంది. లంచాలు లేకుండా విద్యార్థులు నేరుగా ఉద్యోగావకాశాలు పొందేందుకు కాంగ్రెస్ వారికి అవసరమైన మద్దతునిస్తుంది. విద్యార్థుల అభిప్రాయాలను పంచుకునేందుకే కాంగ్రెస్ పార్టీ బెహతర్ భారత్(బెటర్ ఇండియా) ప్రచారాన్ని ప్రారంభించింది. మీ ఆలోచనలే మా ఆలోచనలు.. మీ ప్రాముఖ్యాలే.. కాంగ్రెస్ ప్రాముఖ్యలుగా ఉంటాయి అంటూ రాహుల్ లేఖ ద్వారా విద్యార్థులకు తెలియజేశారు.