కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్
విద్యకు సరైన ప్రాధాన్యతనిచ్చిన సమాజమే లక్ష్యాలను చేరుకుంటుందని ఉద్ఘాటన
ప్రజాపక్షం/హైదరాబాద్ విద్యారంగానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సరైన విద్య లేకుంటే మానవ సమాజం పురోగతి సాధించలేదని, విద్యకు సరైన ప్రాధాన్యం ఇచ్చిన సమాజం మాత్రమే తన లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన రాష్ర్ట విద్యార్థి విభాగం సబ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టం లో అనేక పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో అమ్మాయిలు విద్యకు దూరమవుతున్నారని, వెంటనే అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలను, లైబ్రరీ లను, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 21వ శతాబ్దంలో కూడా విద్యకు తగిన నిధులు కేటాయించలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడమేమిటని నిలదీశారు. కొఠారి కమిషన్ సూచించినట్లు రాష్ర్ట బడ్జెట్ లో 30 శాతం, కేంద్ర బడ్జెట్ లో పది శాతం నిధులు విద్యా రంగానికి
కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో విద్యకు 28 శాతం నిధులు కేటాయించడంతో అక్కడ అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నదని తెలిపారు. వచ్చే బడ్జెట్లో మిగతా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యకు తగిన నిధులు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో ఎఐఎస్ఎఫ్ నిర్మాణ బాధ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ రావు, సబ్ కమిటీ కన్వీనర్ పుట్ట లక్ష్మణ్, సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, అశోక్ స్టాలిన్, రెహమాన్, రఘురాం నరేష్, సంతోష్ పాల్గొన్నారు
విద్యారంగానికి అధిక నిధులు
RELATED ARTICLES