మెరిసిన హర్భజన్, ఇమ్రాన్ తహీర్..
రసెల్ ఒంటరి పోరాటం
చెన్నై లక్ష్యం 109
చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్ల ధాటికి కోల్‌కతా విలవిలలాడింది. సూపర్ కింగ్స్ బౌలర్లు ని ప్పులు చెరిగే బంతులతో కెకెఆర్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. దీపక్ చాహర్ (3/20), హర్భజన్ సింగ్ (2/15), ఇమ్రాన్ తాహీర్ (2/21) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులే చేసింది. కోల్‌కతాలో ఆండ్రీ ర సెల్ (50 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సి క్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. టాస్ ఓడి తొ లుత బ్యాటింగ్ చేసిన కెకెఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ క్రిస్ లీన్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాత సునీల్ నరైన్ (6)ను హర్భజన్ సింగ్.. నితిష్ రాణా (0)ను దీపక్ చాహర్ ఔట్ చేసి కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బేశారు. దీంతో కెకెఆర్ కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. త ర్వాత రాబిన్ ఊతప్ప (9 బంతుల్లో 11)తో కలి సి కెప్టెన్ దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్ర యత్నం చేశాడు. కానీ చాహర్ మరోసారి చెలరేగడంతో ఊతప్ప కూడా ఇంటి ముఖం పట్టాడు. దీంతో కెకెఆర్ 24 పరుగలువద్ద నాలుగో వికెట్ కోల్పోయిది. అనంతరం గిల్ (9), దినేశ్ కార్తిక్ (19; 21 బంతుల్లో 3 ఫోర్లు) కూడా ఔటవడం తో కోల్‌కతా 47 పరుగులకే 6 వికెట్లు కోల్పో యి పీకల్లోతూ కష్టాల్లో పడిపోయింది. ఈసమయంలో ఆండ్రీ రసెల్ ఆపద్భాందవుడిగా వచ్చి కెకెఆర్‌ను ఆదుకున్నాడు. ఆరంభంలో కుదురుగా ఆడిన రసెల్ చివర్లో దూకుడు పెంచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న తాను మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. చివరి వరకు అజేయంగా ఉండి హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 108/9 పరగులు చేయగలిగింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ (50) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
విజృంభించిన దీపక్‌చాహర్
RELATED ARTICLES