ఎన్ఫోర్స్మెంట్ లెహూక్టరేట్ ఇవ్వడానికి నిరాకరణ
10న మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంపై యుకె కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: తనను పరారీలో ఉన్న నేరస్థుడిగా ఇడి ప్రకటించడంపై, తన ఆస్తులను స్వాధీనం చేసుకోవ డం, ముంబయి హైకోర్టు లో తనపై కేసు నడపడాన్ని సవాలు చేస్తూ మద్యం దిగ్గజం విజ య్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇడికి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు సంస్థకు నోటీసు జారీచేసే సందర్భంగా ఇడి పిటిషన్ విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. బ్యాంకు రుణాలను చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై విచారణను నిలిపివేయాలని విజయ్ మా ల్యా ఈ ఏడాది నవంబర్ 22న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ చేసిన వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ‘నోటీసు స్టే ఉండదు’ అని కొన్ని సెకండ్ల తర్వాత ప్రకటించింది. తాను పరారీ లో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదని సెప్టెంబర్‌లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పిఎంఎల్ఎ) న్యాయస్థ్ధానానికి నివేదించా రు. మనీల్యాండరింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. రూ. 9,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకేసులో దర్యాప్తు సంస్థలు సిబి ఐ, ఇడిలు మాల్యాపై అ భియోగాలు నమోదు చే శాయి. న్యాయస్థానాలు ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించడంతో 2016 మార్చిలో మాల్యా లండన్‌కు పారిపోయారు. లండన్‌లో తలదాచుకున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. మాల్యాను భారత్‌కు అప్పగించాలా వద్దా అనే అంశంపై తీర్పును డిసెంబర్ 10న ప్రకటిస్తానని యుకె కోర్టు సెప్టెంబర్‌లోనే వెల్లడించింది. బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు వచ్చేవారం తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో తా ను బ్యాంకు రుణాల అసలు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమని, తన ప్రతిపాదనను బ్యాంకులు అంగీకరించాలని ఇటీవలే మాల్యా కోరారు.