శ్రీహరికోట(ఆప్ర): పిఎస్ఎల్వి ద్వారా 28 విదేశీ నానో ఉపగ్రహాలతో పాటు భారత సైనిక ఉపగ్రహం ‘ఎమిశాట్’ను ఇక్కడి నుంచి ప్రయోగించి భారత్ ఓ సరికొత్త చరిత్రను లిఖించింది. పిఎస్ఎల్వి-సి45 రాకెట్ తన 47వ మిషన్‌లో విద్యుదయస్కాంత కొలత లక్ష్యంగా 436 కిలోల ఎమిశాట్‌ను, దాంతో పాటు లిత్వేనియా,స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాలకు చెందిన 28 సహ ఉపగ్రహాలను ప్రయోగించింది. 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పిఎస్ఎల్వి రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ‘ఎమిశాట్’ విద్యుదయస్కాంత కొలతకు సంబంధించిందని మాత్రమే తెలిపిన ఇస్రో ఆ ఉపగ్రహం గురించిన ఇతర వివరాలను తెలుపలేదు.
ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించిన ప్రధాని మోడీ : పిఎస్ఎల్వి-సి45 ద్వారా శ్రీహరికోట నుంచి ఎమిశాట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించారు. వార్దాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన ‘ఇస్రో ఈ ప్రయోగంతో చారిత్రకంగా లంఘించింది’ అన్నారు.
విజయవంతంగా ‘ఎమిశాట్’ ప్రయోగం
RELATED ARTICLES