రెవెన్యూ వ్యవస్థ యథాతథం
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రంలో విఆర్‌ఒ వ్యవస్థను మాత్రమే రద్దు చేస్తున్నామని, రెవెన్యూ వ్యవస్థ యథాతథంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా కాం గ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ చేసిన పలు విజ్ఞప్తులకు సిఎం కెసిఆర్ స్పందిస్తూ పైవిధంగా స్పష్టతనిచ్చారు. ఈ సం దర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ కేవలం విఆర్‌ఒ వ్యవస్థను రద్దు చేస్తున్నామని, మిగతా రెవెన్యూశాఖ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న విఆర్‌ఒ వ్యవస్థ అరాచకాలకు పాల్పడుతుందని, అందుకే దాని ని రద్దు చేశామన్నారు. ఇకరెవెన్యూ విభాగంలో అన్ని రికార్డులు ఉంటాయని, సర్వే సెటిల్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని, ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సిఎం చెప్పారు. ప్రజా అవసరాలకు కేవలం ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు మాత్రమే అసైన్డ్ భూములను తీసుకుంటున్నామని సిఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి అసైన్డ్ భూములను తీసుకోవడం లేదన్నారు.
విఆర్‌ఒ వ్యవస్థ ఒక్కటే రద్దు
RELATED ARTICLES