ఢాకా: వెస్టిండీస్ వేదికగా కరెబియన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బంగ్లా బౌలర్లకు విండీస్ బ్యాట్స్‌మెన్‌లు తలవంచక తప్పలేదు. మొదటి ఇంన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వారిలో సిమ్రాన్ హెట్మేయిర్ తప్ప ఎవరూ కూడా ఇరవై పైచీలుగా పరుగులు చేయకుండానే పెలియన్ బాటపట్టారు. దీంతో రెండో రోజు(శనివారం) ఆట ముగిసే సమయానికి విండీస్ కేవలం 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. హెట్మేయిర్(32), షేన్ డారిచ్(17)లు క్రీజులో కొనసాగుతున్నారు. బంగ్లా బౌలర్లలో షకిబుల్ హసన్ 2 వికెట్లు, మెహెదీ హసన్ 3 వికెట్టు పడగొట్టి విండీస్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 259/5తో బ్యాటింగ్ దిగిన బంగ్లా మహమ్మదుల్లా(134), లిటన్‌దాస్(54)లు విజృంభించడంతో 509 భారీ స్కోరును విండీస్ ముందు ఉంచింది.