రెండో టెస్టులో 257 పరుగులతో భారత్ గెలుపు
సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీసేన
కింగ్‌స్టన్/జమైకా: టీమిండియా ఖాతాలో మరో విజయం వచ్చి చెరింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. అందరూ ఊహించినట్లే నాలుగో రోజే ఫలితం ఫలితం. వెస్టిండీస్ పర్యటనను కోహ్లీసేన సంపూర్ణంగా ముగించింది. ముందు టీ20, తర్వాత వన్డే.. తాజాగా టెస్టు సిరీస్‌నూ వైట్‌వాష్ చేసి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆతిథ్య జట్టుకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మూడు సిరీస్‌ల్లోనూ అదరగొట్టింది. కొండంత(468 పరుగులు) లక్ష్య ఛేదనకు దిగిన కరీబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే చాప చుట్టేసింది. 45/2తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ప్రత్యర్థి జట్టు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. ఆఖర్లో మాత్రం అనుకున్నట్లే భారత బౌలర్ల ధాటికి దాసోహమైంది. జడేజా(3/58), షమి(3/65), ఇషాంత్(2/37) పోటాపోటీగా బంతితో రెచ్చిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్..విండీస్‌ను 117 పరుగులకే కుప్పకూల్చింది. ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్టు సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన 120 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
విండీస్‌కు వైట్‌వాష్
RELATED ARTICLES