సీరిస్‌పై కన్నేసిన టీమిండియా
ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కరేబియన్లు
నేటి నుంచి జమైకాలో రెండో టెస్టు ప్రారంభం
1-0తో ఆధిఖ్యంలో భారత్
కింగ్ స్టన్: రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సబీనా పార్క్ వేదికగా శుక్రవారం నుంచి భారత్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆంటిగ్వాలో జరిగిన మొదటి టెస్టును 319 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆతిధ్య విండీస్ ఈ మ్యాచ్ అయినా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే రెండో టెస్టుకు విన్నింగ్ కాంబినేషన్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా మరో అవకాశం లభించవచ్చు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా పరుగులు చేయలేకపోయినా.. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉంటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చెప్పనవసరం లేదు. ఇక రోహిత్ శర్మను కాదని తీసుకున్న అంజిక్య రహానే విజయాన్ని సాధించి పెట్టాడు. హనుమ విహారి కూడా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరందరూ రెండో టెస్టులో కొనసాగడం ఖాయం.
మరిన్ని అవకాశాలు..
వికెట్ కీపర్ పంత్ విఫలమయినా.. ధోనీ వారసుడిగా అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చే సూచలు ఉన్నాయి. సీనియర్ కీపర్ సాహాకు మళ్లీ నిరాశే ఎదురవ్వొచ్చు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి టెస్టులో లేకపోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు విమర్శల వర్షం కురిపించారు. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో జడేజా కొనసాగే అవకాశం ఉంది. ఇక పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ( 5/7) విండీస్ ఇన్నింగ్స్‌ను కకాలవికాలం చేసాడు. దీంతో ఈ త్రయం కొనసాగనున్నారు. ఇక అశ్విన్‌కు చోటు దక్కే అవకాశమే లేదు. ఒకవేళ విమర్శల నేపథ్యంలో కాప్టెన్ కోహ్లీ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అశ్విన్ జట్టులోకి రాలేడు.
సమతూకంగా టీమిండియా..
టీ20, వన్డే సీరిసులు గెలుచుకున్న టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. మొదటి టెస్టు మ్యాచ్‌లో రహానె, విహారి, సత్తా చాటారు. పుజారా నామయాత్రంగానే అడినా తన వంతు పాత్ర పోషించాడు. రెండో టెస్టులో కూడా చెలరేగేందుకు వీరు సిద్ధమయ్యారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి, పుజారా, రాహుల్ తదితరులు విజృంభిస్తే భారత్‌కు ఎదురే ఉండదు. విండీస్‌తో పోల్చితే భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. చాలా మంది సీనియర్లే ఉండడంతో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి, అశ్విన్, జడేజా, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ టీమిండియా సొంతం. వీరితో పోల్చితే విండీస్ రెండు విభాగాల్లోనూ చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు పెను సవాలుగా తయారైంది. ఇందులో హోల్డర్ సేన ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.
తుది జట్టులో అశ్విన్‌కు చోటు?
తొలి టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. జడేజా రాణించినా.. విండీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న అశ్విన్‌కు చోటివ్వకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని భారత మాజీలు ప్రశ్నించారు. దీంతో రెండో టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే అశ్విన్‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 350 వికెట్లను చేరుకునేందుకు అశ్విన్ కేవలం 8 వికెట్ల దూరంలో నిలిచాడు. రెండో టెస్టులో చోటు దక్కించుకుని 8 వికెట్లు తీస్తే.. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును అశ్విన్ సమం చేస్తాడు. మురళీ 66 మ్యాచ్‌ల్లో 350 వికెట్లు తీసాడు. ప్రస్తుతం అశ్విన్ 65 టెస్టు మ్యాచ్‌లు ఆడి 342 వికెట్లను పడగొట్టాడు. మరి మురళీ అరుదైన టెస్టు రికార్డును అశ్విన్‌ను బద్దలు కొడతాడేమో చూడాలి. మూడేళ్ల క్రితం వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించినప్పుడు అశ్విన్ ’మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టెస్టు సిరీస్‌లో అశ్విన్ 17 వికెట్లు సాధించి విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. మొత్తంగా విండీస్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 60 వికెట్లు తీసాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తాడో చూడాలి.
అరుదైన రికార్డుకు చేరవలో
ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధిస్తాడు. అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ధోనీ 60 టెస్టులాడి 27 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించాడు. మరో 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 18 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడింది. కోహ్లీ 47 టెస్టు మ్యాచ్‌లాడి 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోగా మరో 10 టెస్టులు డ్రాగా ముగిశాయి. జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే గనుక కెప్టెన్‌గా ధోనికి ఇది 28వ విజయం అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ధోని పేరిట ఉన్న 27 మ్యాచ్‌ల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు. అంతేకాదు విదేశాల్లో టీమిండియాకు అత్యధిక టెస్టు విజయాలనందించిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు సాధిస్తాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో 26 టెస్టులాడగా అందులో 12 మ్యాచ్‌లను గెలిచింది. మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డు(28 మ్యాచ్‌ల్లో 11విజయాలు)ను కోహ్లీ ఇప్పటికే అధిగమించాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 49 టెస్టుల ఆడగా అందులో 21 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. నెలరోజుల సుదీర్ఘ వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీసేనకు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. ఈ టెస్టుతో టీమిండియా వెస్టిండిస్ పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరిస్‌ను 3 టీమిండియా కైవసం చేసుకుంది.
విండీస్ జట్టులో మార్పులు..
రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టులో మార్పులు జరిగాయి. పేసర్ మిగెల్ కమిన్స్ స్థానంలో ఆల్‌రౌండర్ కీమోపాల్ రానున్నాడు. 13 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు దక్కింది. మడమ గాయంతో అతడు తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీమోపాల్ అందుబాటులో ఉన్నాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరో వికెట్ కీపర్ జామర్ హ్యామిల్టన్‌ను జట్టులోనే కొనసాగాలని తాత్కాలిక సెలక్షన్ కమిటీ ఆదేశించింది. మడమ గాయంతోనే సిరీస్‌కు దూరమైన షేన్ డోరిచ్ కోలుకొనేందుకు బార్బడోస్‌కు పయనమయ్యాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. వన్డే, టీ20 సిరీసుల్ని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ తాజాగా టెస్టు సిరీస్‌పై కన్నేసింది.
జట్టు (అంచనా):
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.
వెస్టిండీస్ జట్టు: జేసన్ హోల్డర్ (సారథి), క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, రకీమ్ కార్న్‌వాల్, జామర్ హ్యామిల్టన్, షానన్ గాబ్రియేల్, షిమ్రన్ హెట్‌మైయిర్, షై హోప్, కీమో పాల్, కీమర్ రోచ్.
విండీస్‌కు వైట్‌వాష్?
RELATED ARTICLES