హైకోర్టు ఏది అడిగినా వివరాలు సమర్పించాలి
కరోనా పరీక్షలపై అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించే విషయంలో, వైద్యం అందిస్తున్న విషయంలో, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ సందర్భంగా కోర్టుకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతీ వివరాన్నీ, చేస్తున్న పనిని తెలపాలని సిఎం చెప్పారు. కరోనాపై ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ వైద్య విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా హైకోర్టులో కరోనా విషయంలో దాఖలవుతున్న పిల్స్, వాటిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలోనూ, పరీక్షలు-చికిత్స విషయంలోనూ ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం పట్ల సమావేశంలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు సిఎంఒ తెలిపింది. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభు త్వం, వైద్య శాఖ, వైద్యాధికారులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. ఎంత మందికైనా సరే వైద్యం అందించడానికి ప్రభుత్వ యం త్రాంగం సిద్ధంగా ఉందని, ప్రతీ రోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంత చేసినప్పటికీ హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండ డం బాధకలిగిస్తున్నదన్నారు. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారని, దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని వ్యాఖ్యలు చేస్తుండ డం బాధకలిగిస్తున్నదన్నారు. గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేశారని, దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలు అవుతూనే ఉన్నాయని, హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉందని, ఏ కంగా 87 పిల్స్ పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉందని తెలియజేసినట్లు సిఎంఓ వివరించింది.
వాస్తవాలు చెప్పండి!
RELATED ARTICLES