తలకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వాష్‌రూమ్‌లో జారిపడడంతో గాయపడ్డారు. ఆయన తలకు, ఛాతికి గాయాలైనట్టు సమాచారం. చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మంద కృష్ణ కొంత మంది కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. వెస్టర్న్ కోర్ట్ రెసిడెన్షియల్ బ్లాక్‌లో బస చేశారు. ఆదివారం వాష్ రూమ్‌లో జారిపడ్డారు. కాగా, ఆయనకు బలమైన గాయాలేవీ తగల్లేదని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి, ఆయనను పరామర్శించినట్టు సమాచారం. మంద కృష్ణ హుజూరాబాద్ నియోజవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీపడాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆయనపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. టిఆర్ఎస్ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దెబ్బ తీసి, ఓట్లు చీల్చడానికే బిజెపి ఆయనను బరిలోకి దించుతున్నదని ఆరోపించారు. అయితే, మంద కృష్ణ పోటీలో ఉంటారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
వాష్‌రూమ్‌లో జారిపడిన మంద కృష్ణ
RELATED ARTICLES