సాయుధ ప్రదర్శనల ముప్పు ఉందని ఎఫ్బిఐ హెచ్చరిక
ట్రంప్‌పై రెండోసారి అభిశంసన తీర్మానం నేడే
వాషింగ్టన్ : వాషింగ్టన్ డిసిలో పన్నెండు రోజులపాటు ఎమర్జెన్సీ విధిస్తూ దేశాధ్యక్షుడు డో నాల్డ్ ట్రంప్ ఉత్తర్వులిచ్చారు. బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ మద్దతుదార్లు సా యుధ ప్రదర్శనలు చేసే ముప్పు పొంచి ఉందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) మరోవైపు హెచ్చరించింది. జనవరి 20వ తేదీన బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం సజావుగా సాగేందుకు వీలుగా రాజధానిలో జనవరి 24వ తేదీ వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హోమ్లాడ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) ఎలాంటి విధ్వంసకర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకకు వీలుగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ప్రారంభించాలని డిహెచ్ఎస్ తాత్కాలిక అధిపతి ఉల్ఫ్ సీక్రెస్ సర్వీసెస్‌కు అదేశాలు జారీ చేశారు. ఈ ఎనిమిది రోజులూ క్యాపిటోల్లో పదివేలమంది నేషనల్ గార్డ్ మోహరించి ఉంటారు. అవసరమైతే మరో ఐదువేలమంది కూడా సిద్ధంగా ఉన్నారు. జనవరి 6 వ తేదీన క్యాపిటోల్ భవనంపై ఆయన మద్దతుదార్ల దాడి అనంతర పరిణామాల పూర్వరంగంలో, బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే ప్రశ్నేలేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఆయన రాకపోవడమే మంచిదని అందుకు ప్రతిగా బైడెన్ చురకలంటించారు. కానీ ఆయన సహచరుడైన దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం తాను హాజరవుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా, డెమోక్రాట్ల ఆధిపత్యం ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మంగళవారంనాడు (అమెరికా మనకంటే ఒకరోజు వెనుక ఉంటుంది) డెమోక్రాట్లు ట్రంప్‌ను పదవినుండి తొలగించే ప్రక్రియ చేపట్టాలని, 25వ రాజ్యాంగ సవరణ ఆశ్రయించాలని దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ ఒక తీర్మానం సభకు సమర్పించడానికి సమాయత్తమయ్యారు. దాని కొనసాగింపుగా బుధవారంనాడు అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. ఈ విధంగా ప్రజాస్వామ్య రక్షకురాలుగా పేరొందిన అమెరికాలో నాలుగేళ్ళ పదవీకాలంలో రెండుసార్లు (2019,2021) అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న దేశాధ్యక్షుడుగా చరిత్రలో ట్రంప్ ఒక మచ్చగా మిగిలిపోనున్నారు.
211 మంది సభ్యులుగల దిగువసభలో కాంగ్రెస్ సభ్యులు జామి రస్కిన్, డేవిడ్ సిసిలియన్, టెడ్ లియుల ప్రతిపాదనతో సోమవారంనాడు ఒకరోజు ముందే అభిశంసన తీర్మానాన్ని సభకు సమర్పిస్తారు. క్యాపిటోల్ భవనంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ధృవీకరణపై ఎలక్టోరల్ కాలేజీ కీలక సమావేశం జరుగుతుండగా ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునేందుకు తిరుగుబాటుకు తన మద్దతుదారుల్ని పురిగొల్పారనే నేరంపై ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నారు. సభలో అభిశంసన చేయడానికి డెమోక్రాట్లకు తగినన్ని ఓట్లు ఉన్నాయి. 51-50 మెజార్టీ తేడాలో తృటిలో తీర్మానం గెలిచే మెజార్టీ వారికుంది. ట్రంప్‌ను తొలగించాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలి. కాని రిపబ్లికన్లు కూడా ట్రంప్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, సభలో డెమొక్రాట్లకు అండగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువ. మొత్తం రెండు తీర్మానాలు ప్రవేశపెడతారు. మొదటిది 2020లో జార్జియాలో జరిగిన ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేందుకు ట్రంప్యత్నించారనేది. రెండవ తీర్మానం క్యాపిటోల్ భవనంపై దాడికి కుట్ర చేశారనేది. ఈ రెండు తీర్మానాలను కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ప్రవేశపెడతారు. ఈ వారంలోనే దీనిపై ఓటు వేస్తామని కాంగ్రెస్ సభ్యురాలు మెర్సీ కాప్సర్ చెరప్పగా, రిపబ్లికన్ సెనేటర్ స్టీవ్ డైనెస్ మాత్రం ఇది అభిశంసనకు సమయంకాదు, అధికార మార్పిడి సజావుగా సాగడానికి అందరూ ఐక్యం కావాల్సిన తరుణం అన్నారు. అభిశంసన అనవసరం అని సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యుడు మట్ గాయ్టెజ్ అన్నారు.
వాషింగ్టన్ డిసిలో 12 రోజులు ఎమర్జెన్సీ

RELATED ARTICLES