నేడే అలోక్ వర్మ, ‘కామన్ కాజ్’ ఎన్‌జిఒ సంస్థ పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు విభాగం (సిబిఐ) ఉన్నతాధికారులు పిల్లుల్లా కాట్లాడుకోవడాన్ని ఆశ్చర్యంగా గమనించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం చెప్పింది.సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ,సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా మధ్య పోరు తీవ్రంగా మారిందని, దీనిపై ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో బహిరంగ చర్చలు జరిగాయని తెలిపిం ది. ఉన్నతాధికారు ల తీరును ప్రభుత్వం ఆశ్చర్యంతో గమనించిన ట్లు తెలిపింది. వీరిద్దరూ పిల్లు ల్లా పోరాడుకుంటున్నారని పేర్కొం ది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కెసి వేణుగోపాల్ వాదనలు వినిపించారు. వర్మ, అస్తానా మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఆ దేవుడికే తెలియాలన్నా రు. అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చె ప్పారు. వీరిద్దరినీ సెలవుపై పంపినట్లు ప్రధాన న్యా యమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, కెఎం జోసెఫ్‌లు కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. ప్రభుత్వం స్వతహాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సివిసి) ఉత్తర్వుల మేరకే కేంద్ర ప్రభుత్వం వారిని సెలవుపై పంపిందని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాధించారు. కాగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, సివిసి యాక్ట్ అంశాలను పేర్కొంటూ సిబిఐ మీద పర్యవేక్షణ అధికారం(పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్) కేంద్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. అలో క్ వర్మ చేసిన వాదనకు ప్రతిస్పందనగా ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. వర్మ, అస్తానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. కేం ద్ర ప్రభుత్వం వీరిని సెలవుపై పంపి, నాగేశ్వర రా వును సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత స్థాయి కమిటీ మాత్రమే తనను తొలగించగలదని, ఈ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత కూ డా ఉండాలని తెలిపారు.‘ఆ ఇద్దరు అధికారులు తమ పోరుతో ప్రజల్లోకి వెళ్లారని మీరెలా చెప్పగలరు? వారేమైనా విలేకరుల సమావేశాలు నిర్వహించారా?’ అని ధర్మాసనం ప్ర శ్నించినప్పుడు అటార్నీ జనరల్ వేణుగోపాల్ మీడియా వార్తలను ప్రస్తావించారు. దానికి సంబంధించిన సమాచారం అవసరమైతే సమర్పిస్తానన్నారు. ‘ఒకవేళ సిబిఐకి డైరెక్టరెవరని ఎవరిని అడిగినా అలోక్ కుమార్ వర్మ అనే అంటారు. ఆయన ఇప్పటికీ అదే హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఇక్కడి అధికార నివాసంలోనే ఉంటున్నారు’ అని కూడా తెలిపారు. సిబిఐ బహిరంగంగా అపహాస్యం పాలవుతోందనే ప్రభుత్వం కలత చెందుతోందని ధర్మాసనానికి చెప్పారు. సివిసి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విజిలెన్స్ ప్యానల్‌కు చెందిన చట్టబద్ధ అంశాలతో వాదనలు వినిపించారు. తనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంను సవాలుచేస్తూ వర్మ పెట్టుకున్న వినతి, ‘కామన్ కాజ్’ అనే ప్రభుత్వేతర సంస్థ సిబిఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్ )ఏర్పాటు చేయాలని పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించనుంది