ఒకే రోజు ఏడుగురు మృతి తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత తీవ్రంగా విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. బుధవారంనాడు కొత్తగా 129 కేసులు నమోదయ్యా యి. ఈ కేసుల్లో 108 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనే వెలుగులోకి వచ్చాయి. పైగా జిహెచ్‌ఎంసిని ఆనుకున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 6, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదు కావడంతో గ్రేటర్ హైదరాబాద్, మూడు జిల్లాలపై ఆందోళన మరింత పెరిగిం ది. మరో 2 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి న వలస కార్మికులకు సంబంధించినవి. గత కొన్ని రోజులుగా జిల్లాలకు పాకిన వైరస్ అదే ఊపు కొనసాగుతోంది. కొత్తగా కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 6 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 కేసులు, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ప్రస్తుతం వరంగల్ రూరల్ మాత్రమే నేటికీ కరోనా రహిత జిల్లాగా మిగిలిపోయింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3020కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 1365 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా బుధవారంనాడు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 99కి పెరిగింది. ఇప్పటివరకు 1556 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
వైద్యల్లో కరోనా కలకలం కరోనా కలకలం మొదలైంది. నిమ్స్ వైద్య సిబ్బందిలో కూడా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిమ్స్ ఆస్పత్రిలోని కార్డ్డియాలజీ విభాగంలో పని చేసే ముగ్గురు సిబ్బందికి, నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో అన్ని విభాగాల అధిపతులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కార్డియాలజీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా నిర్ధారణ కాకముందు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఎవరెవరికి వైద్యం చేశారు?, ఏ విభాగాలను క్యారంటైన్‌లో ఉంచాలన్న అంశంపై చర్చించినట్టు తెలిసింది. మొత్తం 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కాగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్య కళాశాల్లో మొత్తం 34 మందికి వైరస్ సోకినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమాయ్యరు. ఉస్మానియా వైద్య కళాశాలలో 280 మంది, గాంధీ కాలేజీలో 250, నిమ్స్‌లో 95 మంది పిజి వైద్య విద్యార్థులకు క్వారంటైన్ విధించినట్టు సమాచారం.
రాష్ట్రంలో కొత్తగా 129 కేసులు
RELATED ARTICLES