భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో దుర్ఘటన
ప్రజాపక్షం/ చర్ల : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఆదివాసీ మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జిడిపల్లి గ్రామస్తులు చర్లలో బుధవారం నిత్యావసరాలు కొనుగోలు చేసి ట్రాక్టర్‌పై వెళ్తుండగా తాలిపేరు ప్రాజెక్టు దాటిన తర్వాత సిఆర్‌పిఎఫ్ క్యాంపు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు పి.లక్ష్మమ్మ, పి.లక్ష్మి, ఎ. కవితలు అక్కడికక్క డే మృతిచెందారు. ప్రమాదం సిఆర్‌పిఎఫ్ క్యాంపు సమీపంలో జరగడంతో క్షతగాత్రులను సిఆర్‌పిఎఫ్ పోలీసులు చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలను అందించారు. మృతదేహాల వద్ద బంధువులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
ట్రాక్టర్ బోల్తా : ముగ్గురు మహిళలు మృతి
RELATED ARTICLES