టెస్టు ఛాంపియన్‌గా కోహ్లిసేన హ్యాట్రిక్
దుబాయి: ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను మరోసారి టీమిండియా కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఐసిసి ప్రతి ఏటా ఇచ్చే టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. టీమిండియా ఐసిసి ట్రోఫీ గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఏప్రిల్ ఒకటి నాటికి టీమిండియా 116 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. దీంతో భారత్‌కు ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్ అవార్డు లభించింది. టీమిండియా మూడు సంవత్సరాలుగా టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఈసారి కూడా నంబర్‌వన్‌గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ఐసిసి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కాగా, న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ కూడా టెస్టుల్లో నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. కాగా, టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న టీమిండియాకు 12 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఐసిసి ఇవ్వనుంది. త్వరలోనే టీమిండియా కెప్టెన్ ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందుకుంటాడు. ఈ విషయాన్ని ఐసిసి సోమవారం ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది.
ఆనందంగా ఉంది: కోహ్లి
వరుసగా మూడోసారి ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టెస్టుల్లో వరుసగా మూడేళ్లపాటు నంబర్‌వన్‌గా నిలువడం అనుకున్నంత తేలికకాదు. అయినా ఈ ఘనత సాధించడం ఎంతో గర్వంగా ఉంది. సమ ష్టి పోరాటం వల్లే జట్టుకు ఈ అరుదైన గౌరవం ద క్కింది. టీమిండియా నంబర్‌వన్‌గా నిలిచిందంటే అందరి సహకారం ఉంది. ఏ ఒక్కరి ప్రతిభా వల్లే ఇది రాలేదు. అంరదు కలిసికట్టుగా తమవంతు స హకారం అందించడం వల్లే వరుసగా మూడో ఏ డాది నంబర్‌వన్‌గా నిలువడం సాధ్యమైంది. రాను న్న రోజుల్లో మరింత మెరుగైన ఆటను కనబరిచేందుకు ఇలాంటి పురస్కారాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో కూడా భా రత్‌కు టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలపడమే తన ము ందున్న ఏకైక లక్ష్యమని కోహ్లి స్పష్టం చేశాడు.
వరుసగా మూడోసారి
RELATED ARTICLES