నేడు విండీస్ మధ్య రెండో వన్డే
గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి
ఇరు జట్టకు కీలకమే..
సాయంత్రం 7 గంటల నుంచి నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా వరుస విజయాలకు వరుణుడు చెక్ పెట్టాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3 సిరీస్‌ను కైవసం చేసుకుని విండీస్‌కు వైట్‌వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యానికి గండీ గొట్టాడు. ఇక వన్డే సిరీస్ దృష్టి సారించిన టీమిండియాకు మొదటి వన్డేను వరుణుడు సాగనివ్వలేదు. భారీ వర్షం కారణంగా గయానా వన్డేను రద్దు చేశాడు. దీనిపైకోహీ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నేడు రెండో వన్డేకు సిద్ధమయింది. కానీ వరుణుడు కరుణిస్తేనే ఈ మ్యాచ్ సాగనుంది లేదంటే టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, సొంత గడ్డపై టి20 సిరీస్‌ను చేజార్చుకున్న కరేబియన్ జట్టు ఎలాగైనా వన్డే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే భారత బ్యాటింగ్‌లో తరచూ సమస్య తలెత్తుతోంది. ఓపెనర్లు శుభారంభాన్ని ఇస్తే మిడిలార్డర్లు చేతులెత్తేస్తున్నారు. మిడిలార్డర్స్ భారం పడుతోంది. దీంతో అందరూ సమష్టిగా రాణిస్తే వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవచ్చు.
వరుణుడు కరుణించేనా
RELATED ARTICLES