సౌరవ్ గంగూలీ
చెన్నై: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను భారత జట్టే గెలుచుకుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సలహాదారు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌర వ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. అ డ్వాన్డ్ హెయిర్ స్టూడియోకు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నా డు. అయితే ఆ సంస్థ పదో వార్షికోత్సవం సందర్భంగా గంగూలీ మంగళవారం చె న్నైకు చేరురొని సందడి చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. వీరాట్ కోహ్లీ నా యకత్వంలో భారత జట్టు మంచి ఫలితా లు రాబడుతోంది. జట్టులో యువ క్రీడాకారులు కూడా జోరును ప్రదర్శిస్తూ ఉత్సాహపరుస్తున్నారు. ఈ ఉత్సాహమే విజయానికి దారితీస్తుంది. ఒక్క కోహ్లీ మాత్రమే కాదు సీనియర్ ధోని సహా అందరూ ప్రతిభావంతులైన క్రీడాకారులు జట్టులో ఉన్నా రు. ఇక తమ హయాంతో పోల్చుకుంటే క్రికెట్ క్రీడారంగంలో ఒత్తిళ్లు బాగా పెరిగాయి, ఒకొక్క స్థానానికి గట్టి పోటీ నెలకొని ఉంది. ఆ ఒత్తిడిని సైతం ఆటగాళ్లు అధిగమించి జాతీయ జట్టులో చోటు సాధిస్తున్నారు. ఇక ప్రపంచకప్ విషయానికొస్తే భారత్‌తో పాటు ఇతర జట్లు కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఏ జట్టును తక్కువ అంచనా వేసే ప్రసక్తే లేదు. అన్నిదేశాల జ ట్లు మెరుగైన క్రీడను ప్రదర్శిస్తున్నాయి. ఈసారి అన్ని జట్లు పటిష్టంగా ఉండడం తో ప్రపంచకప్ పోటీలు మరింతగా ఉత్కంఠంగా సాగుతాయన్నాడు.
వరల్డ్‌కప్ భారత్‌దే
RELATED ARTICLES