ఇ-సేవ, మీ-సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన బాధితులు
క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం
నేరుగా బ్యాంకు ఖాతాల్లో వరద సాయం డబ్బులు జమ చేస్తాం
జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేశ్ కుమార్ వివరణ
ప్రజాపక్షం/హైదరాబాద్ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా ఇ మీ- కేంద్రాల వద్దకు బాధితులు భారీగా చేరుకున్నారు. 7వ తేదీ నుంచి తిరిగి వరద సాయం అందచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆధార్‌కార్డులు, బ్యాంకు పాసు పుస్తకాలతో పెద్ద సంఖ్య లో వరద బాధితులు ఉదయం నుంచి ఇ మీ- కేంద్రాలకు తరలివచ్చారు. బాధితులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేశ్ కుమార్ వివరణ ఇచ్చా రు. వరద సాయం కోసం బాధితులు మీ- ఇ కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. జిహెచ్‌ఎంసి బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల ఆధార్ నెంబర్, బ్యాంకు పాసు పుస్తకాల వివరాలు సేకరించిన అనంతరం వారి వారి ఖాతాల్లోకి నేరుగా వరదసాయం డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కమిషనర్ ప్రకటనను నగరంలోని అన్ని మీ-సేవ, ఇ కేంద్రాలకు ప్రదర్శించడంలో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వరద సాయం మరిచారా?
RELATED ARTICLES