ప్రజాపక్షం/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వి ఫలమైందని పిసిపి అధ్యక్షులు చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎంఎస్ మ క్తా, ఖైరతాబాద్ గణేశ్, సిబిఐ క్వార్టర్స్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ లో వంద రోజుల ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని, కెటిఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారన్నారు. హైదరాబాద్ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. ముందు వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించా రు. మౌలిక వసతులు కల్పించకపోవడమే నగరం లో దుస్థితికి కారణమన్నారు. వరదల మరణాల ను తక్కువ చేసి చూపుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబ ర్లు కూడా పనిచేయడం లేదన్నారు. తాము గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంలో ప్రభుత్వం విఫలమైయిందని విమర్శించారు. వర్షం పడితే వరద నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. సిఎం కెసిఆర్, మం త్రి కెటిఆర్‌లు హైదరాబాద్‌లో ఏం పనులు చేశారని ప్రశ్నించారు. భారీ వర్షాలు పడతాయని వా తావరణ శాఖ హెచ్చరించినా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరదలకు చనిపోయిన వారి సం ఖ్యనూ తక్కువ చేసి చూపుతున్నారని ఉత్తమ్‌కుమా ర్ రెడ్డి ఆరోపించారు.