చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కా ర్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇళ్ళు కూలిపోయి, కోల్పోయి నిరాశ్రయులైన వారికి పక్కా ఇండ్లు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. అనేక జిల్లా ల్లో పంటల నష్టాలు సంభవించాయని, వాటిని వెంటనే అంచనా వేసి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ర్షాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరం, పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మే డ్చల్ జిల్లాల్లో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని, చాలా చోట్ల విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవించారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కాలనీల్లో, బస్తీల్లో నీరు ఇండ్లలోకి ప్ర వేశించి జలదిగ్భందనంలో ఉన్నాయన్నారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలిపోవడంతో కొంత మంది మరణించారన్నారు. నాలాల ఆక్రమణతో నీరు రోడ్లపైకి రావడంతో రోడ్డుపైన వెళుతున్నవారు నీటి ప్రవాహంలో కొ ట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోవడం జరిగిందని తెలిపారు. ఈ వరదల వల్ల నిరాశ్రయులైన వారికి సహాయక చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నగర ప్ర జలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలని చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కేవలం వర్షాలు, వరదలు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాదని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిపుణులతో ఒక కమిటి వేసి లోతైన అధ్యయనం చేయించాలన్నారు. అఖిల పక్షాల సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. అనేక చెరువులు, కుంట లు, నాలాలు కబ్జాకు గురవడంతో కొద్ది పా టి వర్షాలకే ఇళ్లలోకి నీరొచ్చే పరిస్థితి ఏర్పడిందని,గతంలో కూడా అనేక మంది నీళ్ళ లో కొట్టుకొని పోయిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ప్రభుత్వం ప క్కాగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిం చి, అమలు చెయ్యాలి. హైదరాబాద్ నగరం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను మరిం త సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నగర పరిధిలో సహాయక చర్యలు చే పట్టే బృందాల ద్వారా వెంటనే సహాయక చర్యలు చేపట్టి, జనజీవనాన్ని పునరుద్దరింపజేయాల్సిందిగా కోరారు.
వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా
RELATED ARTICLES