ప్రయాగ్‌రాజ్ : ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ్‌రాజ్ వరద నీటిలో మునిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గంగ, యమున నదులు పోటెత్తి ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే పడవలే గతి.
ఉప్పొంగిన గంగ-యమున.. నీట మునిగిన నగరం గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో గంగ-యమున నదులు ఉప్పొంగి నగరం నీట మునిగింది. దరగంజ్, సలోరి, బఘద, రాజ్‌పుర్, నైనీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మొదటి అంతస్థులోకి కూడా నీరు చేరాయంటే వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. గంగా నది ప్రవాహం ప్రమాదకరంగా, 84.73 మీటర్ల మేర పారుతున్నది. యమునా నది 83.88 మీటర్ల మేర ప్రవహిస్తున్నది. వరద నీటిలో ఇళ్లతోపాటు పలు ఆలయాలు, దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థల కార్యాలయాలు మునిగిపోయాయి. సహాయక చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.
వరద నీటిలో ప్రయాగ్‌రాజ్
RELATED ARTICLES