ముంబయి : ప్రస్తుతం భారత్-దక్షిxణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ఈ సిరీస్‌పైనా పడింది. లక్నో వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డే, కోల్‌కతాలో బుధవారం జరగనున్న మూడో వన్డేకి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరగనున్నాయి. వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి వస్తే..? కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు బిసిసిఐ ఆ నిర్ణయం తీసుకుంది.
వన్డే సిరీస్‌పైనా కరోనా ప్రభావం.. రద్దు
RELATED ARTICLES