HomeNewsBreaking Newsవన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమ్‌ ఇండియా

వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమ్‌ ఇండియా

దుబాయ్‌: ఐసిసి తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను 3- గెలిచిన భారత్‌ మరో మూడు రేటింగ్‌ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. ఇక నెదర్లాండ్‌ను 3- క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ సైతం సైతం ఒక పాయింట్‌ను పెంచుకొని 107తో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (124), ఇంగ్లండ్‌ (119) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అంత ఈజీగా తలొగ్గలేదు. విజయం కోసం గొప్పగా పోరాడింది. సికందర్‌ రజా (115; 95 బంతుల్లో 9×4, 3×6) సంచలన ఇన్నింగ్స్‌తో జింబాబ్వేను గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. చివర్లో భారత్‌ బౌలర్లు పుంజుకోవడంతో 13 పరుగులతో గట్టెక్కింది. అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌(130) సెంచరీతో రాణించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్‌ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో 189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా చేధించగా.. రెండో మ్యాచ్‌లో దాదాపు సగం ఓవర్లు మిగిలుండగానే విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్‌ కోసం యుఎఇకి చేరుకుంది. ఇక ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్గనిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో 15వ ఆసియాకప్‌కు తెరలేనుంది. ఆ మరుసటి రోజు (ఆగస్టు 28) టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్‌ కూడా టైటిల్‌ కోసం పోటీపడతుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments