న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు తిరిగి వన్డేల్లో చోలు లభించింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం 14 మందితో కూడిన స్కాడ్‌ను గురువారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ దృశ్య హిట్టర్ గేల్‌కు తిరిగి చాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. గేల్ చివరి సారిగా గత ఏడాది జులైలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. గేల్‌కు వన్డేల్లో మంచి రికార్డులు ఉన్నాయి. విండీస్ తరఫున అత్యధికంగా (25) సెంచరీలు చేసిన రికార్డు గేల్‌కే సొంతం. వన్డేల్లో గేల్ (9727) పరుగులు చేశాడు. ఇతనికంటే ముందు బ్రియన్ లారా (10,405) ఉన్నాడు. గేల్ 2015 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై (215) పరుగులు చేశాడు. ఇతనికి వ్యక్తిగతంగా ఇదే అత్యధిక పరుగులు కావడం విశేషం.
వన్డేల్లో క్రిస్ గేల్‌కి చాన్స్..
RELATED ARTICLES