ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రెండవ స్వదేశీ రైలును ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 పెద్ద అడ్డంకి అని, ఢిల్లీ వందే ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో ఆ ప్రాంతంలో ఇక అభివృద్ధి పట్టాలెక్కనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రైల్వేశాఖమంత్రి పీయుస్ గోయల్, కేంద్రమంతులు జితేంద్ర సింగ్, హర్షవర్దన్‌లతో కలిసి అమిత్ షా గురువారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న జ మ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీ కాత్రా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం చర్యలు కొత్త జమ్మూకశ్మీర్‌కి కొ త్త భారతావనిని తెస్తుందని, ఈ ప్రాంతంలో కొత్త చరిత్ర సృష్టిస్తోందని అన్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెల్ రెండవ రైలును జెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా మాట్లాడుతూ కేవలం ఈ దేశ ఐక్యతకు మాత్రమే ఆర్టికల్ 370 అడ్డంకు కాదని, జ మ్మూకశ్మీర్‌కు అభివృద్ధికి కూడా అతిపెద్ద అడ్డం కి అని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధంగానే ఉగ్రవాదాన్ని ఏరివేయడంలోనూ, దానిని ప్రోత్సహించే ఆలోచనల ను అంతమొందించడంలో కూడా తాము కచ్చితంగా పూర్తిగా విజయం సాధిస్తామని ఉద్ఘాటించారు. రాబోయే పదేళ్లలో జమ్మూకశ్మీర్ దేశంలో నే అత్యధిక అభివృ-ద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు వందే భా రత్ ఎక్స్‌ప్రెస్ రైలు పెద్ద బహుమతి అని, ఆధ్యాత్మిక పర్యాటకానికి, అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల పోరాటం అనంతరం జమ్మూకశ్మీర్ ప్రజలను వరించిన పెద్ద బ హుమతి ఆర్టికల్ 370 రద్దు అని అన్నారు.