జావెలిన్‌త్రోలో నీరజ్‌కు స్వర్ణం
అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ఘనత
13 సంవత్సరాల తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి
టోక్యో: ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వందేళ్లకుపైగా అందని ద్రాక్షగానే మిగిలిన పతకాన్ని 23 ఏళ్ల యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అందించాడు. టోక్యో ఒలింపిక్స్ వేదికగా పురుషుల జావెలిన్ త్రో అతను స్వర్ణ పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత ఒలిపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో పతకం రావడం ఇదే మొదటిసారి. కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. వందేళ్ల కలను సాకారం చేశాడు. ఫైనల్ తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు దూరం విసిరిన నీరజ్ రెండో ప్రయత్నంలో 87.58 మీటర్ల దూరంతో నంబర్ వన్‌గా నిలిచాడు. ఆ త్రోనే అతనికి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టింది. మొదటి రౌండ్ నుంచి చివరి వరకూ నీజర్‌కు ఎదురులేకపోయింది. మొత్తానికి 13 సంవత్సరాల తర్వాత ఇండివిజువల్ ఈవెంట్‌లో అతను భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో అభినవ్ బింద్రా పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆతర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు, 1900 పారిస్ ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ (బ్రిటీష్ ఇండియా) తరఫున బరిలోకిదిగి,
అథ్లెటిక్స్‌లో 200 మీటర్ల హర్డిల్డ్, 200 మీటర్ల స్ప్రింట్స్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భారత్‌కు పతకం లభించలేదు. 120 ఏళ్ల తర్వాత ఆ ఘనతను నీరజ్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్యను 7కు చేర్చాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు సాధించిన భారత్ ఈసారి ఏడు పతకాలతో రాణించింది.
వందేళ్ల కల… ఫలించిన వేళ..
RELATED ARTICLES