ఆరేళ్ల తర్వాత భారీగా పెరిగిన ధర
ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 144.50 పెంపు
ప్రస్తుత సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 1,241
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌పై బుధవారం అమాంతంగా రూ. 144. 50కి పెరిగిపోయింది. దీంతో రూ. 714గా ఉన్న ఒక్క సిలిండర్ రూ. 858కు చేరింది. కాగా కేంద్ర ఇచ్చే రాయితీని కూడా పెంచారు. గతంలో ఇచ్చిన రాయితీ రూ. 153.86ను రూ. 291.48కి పెంచారు. ప్రధాన మంత్రి ఉజల యోజన(పిఎంయువై) లబ్ధిదారులకు రాయితీని రూ. 174.86 నుంచి రూ. 312.48కి పెంచారు. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ ధరలు అత్యధిక స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. 2014లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 220 ఉండగా ఇప్పుడు రూ. 1,241కి పెరిగింది. సబ్సిడీ వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమచేశాక డొమెస్టిక్ వినియోగదారుడికి 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 567.02 అవుతుంది. ఇక ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు రూ. 546.02 అవుతుంది. పర్యావరణ అనుకూల వంటగదులను పెంచేందుకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పేద మహిళలకు ప్రభుత్వం 8 కోట్ల ఉచిత ఎల్‌పిజి కనెక్షన్లు ఇప్పించింది. సాధారణంగా ఎల్‌పిజి రేట్లను ప్రతినెల ఒకటో తేదిన సమీక్షిస్తుంటారు. కానీ ఈసారి దాదాపు రెండు వారాలు ఆలస్యం జరిగింది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు అంటుండగా, దానికి కారణం ఢిల్లీ ఎన్నికలేనని ఇతరులు భావిస్తున్నారు.
ప్రజల జేబుకు కరెంట్ షాక్: కాంగ్రెస్
ఎల్‌పిజి సిలిండర్ ధరలను బిజెపి పెంచేసి ప్రజల జేబులకు కరెంట్ షాక్ ఇచ్చిందని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినందున సిలిండర్‌పై రూ. 144.50 వరకు పెంచారు. అయితే డొమెస్టిక్ వాడకం దారులను కాపాడేందుకు(ఇన్సులేట్ చేయడానికి) బదులు ప్రభుత్వం సిలిండర్‌కు ఇచ్చే సబ్సిడీకి రెట్టింపు పెంచేసిందని. ‘మోడీజీ 2019 వంటగ్యాస్ ధరను రూ. 200 పెంచారు. ఏడాదిలోగా మళ్లీ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.144కు పెంచేశారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ‘వారు ప్రజల జేబుకు కరెంట్ పెట్టేశారు’ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ: వంటగ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌పై బుధవారం అమాంతంగా రూ. 144. 50కి పెరిగిపోయింది. దీంతో రూ. 714గా ఉన్న ఒక్క సిలిండర్ రూ. 858కు చేరింది. కాగా కేంద్ర ఇచ్చే రాయితీని కూడా పెంచారు. గతంలో ఇచ్చిన రాయితీ రూ. 153.86ను రూ. 291.48కి పెంచారు. ప్రధాన మంత్రి ఉజల యోజన(పిఎంయువై) లబ్ధిదారులకు రాయితీని రూ. 174.86 నుంచి రూ. 312.48కి పెంచారు. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్ ధరలు అత్యధిక స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. 2014లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 220 ఉండగా ఇప్పుడు రూ. 1,241కి పెరిగింది. సబ్సిడీ వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమచేశాక డొమెస్టిక్ వినియోగదారుడికి 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 567.02 అవుతుంది. ఇక ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన వినియోగదారులకు రూ. 546.02 అవుతుంది. పర్యావరణ అనుకూల వంటగదులను పెంచేందుకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పేద మహిళలకు ప్రభుత్వం 8 కోట్ల ఉచిత ఎల్‌పిజి కనెక్షన్లు ఇప్పించింది. సాధారణంగా ఎల్‌పిజి రేట్లను ప్రతినెల ఒకటో తేదిన సమీక్షిస్తుంటారు. కానీ ఈసారి దాదాపు రెండు వారాలు ఆలస్యం జరిగింది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు అంటుండగా, దానికి కారణం ఢిల్లీ ఎన్నికలేనని ఇతరులు భావిస్తున్నారు.
ప్రజల జేబుకు కరెంట్ షాక్: కాంగ్రెస్
ఎల్‌పిజి సిలిండర్ ధరలను బిజెపి పెంచేసి ప్రజల జేబులకు కరెంట్ షాక్ ఇచ్చిందని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినందున సిలిండర్‌పై రూ. 144.50 వరకు పెంచారు. అయితే డొమెస్టిక్ వాడకం దారులను కాపాడేందుకు(ఇన్సులేట్ చేయడానికి) బదులు ప్రభుత్వం సిలిండర్‌కు ఇచ్చే సబ్సిడీకి రెట్టింపు పెంచేసిందని. ‘మోడీజీ 2019 వంటగ్యాస్ ధరను రూ. 200 పెంచారు. ఏడాదిలోగా మళ్లీ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.144కు పెంచేశారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ‘వారు ప్రజల జేబుకు కరెంట్ పెట్టేశారు’ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో హోంమంత్రి అమిత్ షా ‘షాహీన్ బాగ్‌లో నిరసన తెలుపుతున్న వారికి కరెంట్ తగిలేలా ఓటింగ్ మెషిన్ బటన్ నొక్కండి’ అన్న మాటను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ షాక్ ఇచ్చారని సూర్జేవాలా పేర్కొన్నారు.
క్రూర నిర్ణయం: మాయావతి
వంటగ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచేసినం దుకు కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీ మో మాయావతి విమర్శించారు. ఇది పేదలకు వ్యతి రేకంగా తీసుకున్న ‘క్రూర నిర్ణయం’ అని ఆమె అభివ ర్ణించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ఇం ధన ధరలకు అనుగుణంగా సిలిండర్ ధరను పెంచిన ప్పటికీ, ఈ నిర్ణయం కోట్లాది పేదలను, ఇప్పటికే తీవ్ర ద్రవ్యో ల్బణం కారణంగా కష్టాలు పడుతున్న కష్ట జీవు లను దెబ్బతీయనుందని అన్నారు. ‘రాజ్యాంగలో పేర్కొన్న సంక్షేమ రాజ్యం కోసం కేంద్రం పాటుపడితే బాగుం టుంది’ అని ఆమె ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఎల్ పిజి 14.2 సిలిండర్ ధరను ఇదివరలో రూ.714 కు పెంచితే ఇప్పుడు రూ. 858.50కు పెంచేశారు.2014 తర్వాత సిలిండర్ ధర అత్యధికంగా రూ.1,241కి చేరు కుంది. అప్పట్లో ఒక్క సిలిండర్ ధర రూ. 220గా ఉండేది.
ప్రజా వ్యతిరేక నిర్ణయం : టిఎంసి
ఎల్‌పిజి సిలిండర్ ధరను బిజెపి ప్రభుత్వం పెంచడంపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఎల్‌పిజి 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 144.50 పెంచడంతో అదికాస్తా ఒక్కో సిలిండర్ ధర రూ. 858.50 కావడాన్ని విమర్శించింది. ‘బిజెపి తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయి. అనేక అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా అపజయాన్ని చవిచూస్తున్నప్పటికీ కాషాయ పార్టీ పాఠాలు నేర్చుకోవడంలేదు’ అని టిఎంసి ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ అన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటున్నారు: సిపిఐ(ఎం)
‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనందుకు వారు (బిజెపి) ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్రజలు ఓటేయలేదన్న కారణంగా వారీ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.ఎల్‌పిజి ధరలు పెంచేసి వారు శిక్షిస్తున్నారు’ అని పశ్చిమబెంగాల్ సిపిఐ(ఎం) శాసనసభా పక్షనేత సుజన్ చక్రబర్తి చెప్పారు. కాగాఎల్‌పిజి ధ రల పెంపుతో ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు. ‘ఎల్‌పిజి ధరలు పెరగడం, తరగడం పీరియాడికల్‌గా జరుగుతుంటాయి. దానికి ఢిల్లీ ఎన్నికలకు సంబంధం లేదు’అని ఆ యన వ్యాఖ్యానించారు. ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 62 సీట్లు గెలుచుకుంది. కాగా బిజెపి మిగతా 8 స్థానాలు గెలుచుకుంది.
వంట గ్యాస్ ధర భగ్గుమంది!
RELATED ARTICLES