ముంబయి : తాము పండించిన పంటను కేవలం పైసల్లోనే కొనుగోలు చే స్తుండడంతో మహారాష్ట్రలోని ఓ వంకాయ రైతుకు చిర్రెత్తుకొచ్చింది. వంకా య ధర కిలోకు 20 పైసలు మాత్రమే పలుకుతుండడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ఆ రైతు తాను వేసిన మొత్తం పంటను ధ్వంసం చేశాడు. మ రింత అప్పుల్లో కూరుకుపోకుండా తనకు తాను అప్రమత్తమయ్యాడు. రూ. 2 లక్షలు వెచ్చించడంతో పాటు తన శక్తినంతా దారపోసి వంకాయ పంట ను వేశానని అహ్మద్‌నగర్ జిల్లా రహత్ తహశీల్ సూకరి గ్రామానికి చెందిన రాజేంద్ర బవకె పేర్కొన్నాడు. తాను పండించిన పంటకు కేవలం రూ. 65 వేలు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురై రాజేంద్ర ఆదివారం మొత్తం వంకాయ పంటను తొలగించి విసిరివేశాడు. రెండు ఎకరా ల్లో వంకాయ మొక్కలను నాటనని, దానికి డ్రిప్‌ను ఏర్పాటు చేశానని రా జేంద్ర మీడియాకు తెలిపారు. పంట ఉత్పత్తి పెంచేందుకు ఎరువులు, పురుగుమందులను వేయడంతో పాటు ఆధునిక పద్ధతుల ద్వారా పంటన సాగుచేశానన్నాడు. మొత్తంగా రూ. 2 లక్షల వరకు వెచ్చించానన్నారు. ప్రతిఫలంగా తనకు లభించింది కేవలం 65 వేలు మాత్రమేనని వాపోయాడు. ఎ రువులు, మందులు సరఫరా చేసిన వారికే రూ. 35 వేలు బాకీ పడ్డానని, ఆ అప్పును ఎలా తీర్చాలో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను పండించిన పంటను నాశిక్‌లో, గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే కిలో ధర కేవలం 20 పైసలు మాత్ర మే పలుకుతోందని చెప్పారు. దీంతో పంటను మొత్తం ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.