11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు
న్యూఢిల్లీ: లోక్‌సభ 95 స్థానాలకు జరిగే రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తం గా 11 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాం తంలో గురువారం ఈ ఎన్నికలు జరగనున్నా యి. ఈ రెండో విడత ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రముఖులలో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జువల్ ఓరమ్, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, డిఎంకెకు చెందిన దయానిధి మారన్, ఎ. రాజా, కనిమొళి తదితరులు ఉన్నారు. తమిళనాడులో 39 లోక్‌స భ స్థానాల్లో 38 స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికను రద్దు చేశారు. ఎన్నికల సంఘం త్రిపుర(తూర్పు) లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నికను ఏప్రిల్ 23న జరిగే మూ డో విడతకు వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి కావలసిన శాంతిభద్రతల పరిస్థితి అనుకూలం గా లేదని తెలిపింది. తమిళనాడుతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలకు, మహారాష్ట్రలోని 10, ఉత్తరప్రదేశ్‌లోని 8, అసోం, బీహార్, ఒడిశాల లో ఐదేసి స్థానాలకు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో మూడేసి స్థానాలకు, జమ్మూకశ్మీర్‌లో 2, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. గురువారం జరిగే 95 లోక్‌సభ స్థానా ల్లో ప్రస్తుతం ఎఐఎడిఎంకెకు గరిష్ఠంగా 36, బిజెపికి 27 స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ వీటిలో 12 గెలవగా, శివసేన, బిజెడి నాలుగేసి, జెడి(ఎస్), ఆర్‌జెడి రెండేసి, ఎఐయుడిఎఫ్, ఎన్‌సిపి, జెడి(యు), పిడిపి, ఎఐఎన్‌ఆర్‌సి, పిఎంకె, సిపిఐ(ఎం), టిఎంసి ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో 15.8 కోట్ల ఓటర్లు ఓటేసే అర్హత కలిగి ఉన్నారు. ఈసారి పోటీపడుతున్న ఇతర ప్రముఖులలో రాజ్‌బబ్బర్, వీరప్ప మొయిలీ, ఫరూఖ్ అబ్దుల్లా, హేమా మాలిని ఉన్నారు. తమిళనాడులో ఎఐఎడిఎంకె ఎన్‌డిఎతో పొత్తుపెట్టుకుని, బిజెపి, పిఎంకె, డిఎండికె, తమిళ్ మానిల కాంగ్రెస్‌తో కలసి పోటీపడుతోంది. కాగా డిఎంకె మాత్రం కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తుపెట్టుకుని ‘సెక్యూలర్ ప్రొగెసివ్ అలయన్స్’ కింద పోటీచేస్తోంది. తమిళనాడులో పో టీ ప్రధానంగా ఎఐఎడిఎంకె, డిఎంకె, టిటివి దినకరణ్ సారథ్యంలోని ఎఎంఎంకె పార్టీల మధ్యే ఉండనున్నది.