ప్రజాపక్షం/ హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పోటీ చేయబోరని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు స్పష్టం చేశారు. ఇక్కడే చాలా పనులు ఉన్నాయని, లోక్‌సభ ఎన్నికల్లో ఎంపిగా ఎందుకు వెళ్తారన్నారు. తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో శనివారం కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఎంపిగా కెసిఆర్ పోటీ చేస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయని, ఆయనేందుకు(కెసిఆర్)ఎంపిగా వెళ్తారని ప్రశ్నించారు. సిట్టి ంగ్ ఎంఎల్‌ఎలు ఎంపిలుగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన త్రోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్‌ఎలు పోటీ చేయబోరని కెటిఆర్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్, బిజెపికి అవకాశం లేదని,ఉత్తరప్రదేశ్ లో కూడా ఆ రెండు పార్టీలు గోరంగా దెబ్బతింటాయని వివరించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ 16 సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ధీమావ్యక్తం చేశా రు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కెసిఆర్ దూరం
RELATED ARTICLES