ఇఎస్‌ఐ స్కామ్‌లో తొమ్మిదికి చేరిన నిందితుల సంఖ్య
హైదరాబాద్ : ఇఎస్‌ఐ కుంభకోణంలో ఎసిబి అధికారులు శనివారం ప్రైవేటు మెడికల్ ఫార్మా కంపెనీ లైఫ్ కేర్ డ్రగ్స్ యజమాని బద్దం సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్ప టి వరకు తొమ్మిది మందిని ఎసిబి అధికారులు కటకటాల వెనక్కి పంపించినట్లయింది. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మందుల కొనుగోళ్ల కుంభకోణం లో మధుసూదన్‌రెడ్డి ఇఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ దేవికరాణితో చేతులు కలిపి అందినకాడికి దండుకున్నట్లు ఎసిబి విచారణలో తేలింది. ఇతని ఇంటితోపాటు పార్మా కంపెనీ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడి చేయగా కీలక డాక్యుమెంట్లు లభించాయి. తక్కువ రేటు ఖరీదు చేసే మందులకు ఎక్కువ ధరను చూపించి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని, ఉద్దేశ్యపూర్వకంగానే సుధాకర్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఎసిబి అధికారుల విచారణలో తేలింది. అతని వద్ద రూ.8.25 కోట్ల విలువగల మందుల కోనుగోళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. దీంతో అతన్ని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో సుధాకర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
లైఫ్ కేర్ ఎండి అరెస్టు
RELATED ARTICLES