న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడిచిపోతున్నా భారత లేబర్ మార్కెట్‌లో కుల, మత, లింగ వివక్షకు మాత్రం తెరపడడం లేదు. ము ఖ్యంగా మహిళలు, మైనారిటీలకు ఎలాంటి న్యా యం జరగడం లేదు. ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దేశ లేబర్ మా ర్కెట్‌లోని భయానక వివక్ష భూతాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నది. ఈ నివేదికను అనుసరించి లేబర్ మార్కెట్‌లో వివక్ష ఎవరూ కాదనలేని నిజం. ఇది ఒక నగరానికి లేదా పట్టణానికి లేదా ఏదైనా ప్రాంతానికి పరిమితం కాలేదు. కులాల ప్రాతిపదికన చూస్తే షెడ్యూల్డ్ కులాలు, తెగలు.. మతాన్ని పరిగణలోకి తీసుకుంటే ముస్లిమ్‌లు, పార్సీలు, జైనలు తదితర మతాలు.. లింగ పరం గా చూస్తే, మహిళలు.. దారుణ వివక్షకు గురవుతున్నారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాల పట్ల వివక్ష గ్రా మాలతో పోలిస్తే, నగర, పట్టణ ప్రాంతాల్లో ఎక్కు వ. కార్మిక విపణిలో కొనసాగుతున్న వివక్షలో ప్రధానమైనది వేతనం. ఉపాధి కల్పన లేదా వేతనం.. రెండు అంశాల్లోనూ కుల, మత, లింగ వివక్ష వేళ్లూనుకుంది. అనాదిగా వస్తున్న కులవృత్తులు లేదా తత్సంబంధమైన ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్న వారితోపాటు వేతనాలకు పని చేస్తున్న శ్రామికులూ ఎక్కువగానే ఉన్నారు. ఆలోచనలోగానీ, నైపుణ్యంలోగానీ, శ్రమ ను అందించడంలోగానీ పెద్దగా తేడాలు లేకపోయినప్పటికీ, అందరికీ ఒకే స్థాయిలో ప్రతిఫలాలు లభించకపోవడాన్నే వివక్షగా పేర్కోవచ్చు. ఒకే రకమైన పనిని, ఒకే రీతిలో చేస్తున్నప్పటికీ, వర్గాల వారీగా లేబర్ మార్కెట్‌లో భారీ తేడాలు ఉన్నా యి. మూలధన మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకేలా సామర్థ్యాలు ఉన్న వ్యక్తులను విభిన్న రీతుల్లో చూడడం, చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని కొనసాగించడం ఒక సామాన్య ప్రక్రియగా మారింది. ఉదాహరణకు విద్యాపరంగాగానీ, అనుభవంలోనీ, నైపుణ్యంలోగానీ ఒకే స్థాయిలో ఉన్న వ్యక్తులతో పని చేయించుకుంటున్న తీరు, చెల్లిస్తున్న జీతభత్యాలు వేరువేరుగా ఉండడం పరిస్థితిలో ఏ మాత్రం మార్పురాలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రతిఫలాలు కొద్దిపాటి తేడాలో పెరిగినప్పుడు వివక్ష తీవ్ర స్థాయిలో ఉండదు. కానీ, లేబర్ మార్కెట్‌లో ఇలాంటి వాతావరణాన్ని కోరుకోవడం అత్యాశే అవుతుంది. పురుషులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు గలిగి ఉన్నప్పటికీ, వారితో సమానంగా మహిళలకు వేతనాలు లేదా కూలీ దక్కడం లేదు. ఇందుకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతికాది అనేకానేక అంశాలు కారణమవుతున్నాయి. కులం-.. మతం, మెజారిటీ.. -మైనారిటీ, ప్రాంతీయత-..జాతీయత, పేద..-ధనిక, స్త్రీ..-పురుష, వర్గం..-వర్ణం, భాష..-సంస్కృతి ఇలా అనేక రకాలుగా సమాజం విభజితమై ఉంటుంది. అది సహజం. అయితే, మన దేశంలో ఈ విభజన వెనుకగల శక్తులు, సమాజంలోని అన్ని మూలాలకు వ్యాపించాయి. మనిషి మనుగడకు అత్యవసరమైన ఉపాధి, ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వివక్ష అనేది, ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా ప్రమాదకరమే. ఏ రకంగా అమలవుతున్నా భయానకమే. ఈ వ్యత్యాసాలను రూపుమాపడానికే లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. సాక్ష్యాత్తు రాజ్యాంగమే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించింది. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా గోచరిస్తున్నాయి. లేబర్ మార్కెట్‌లో వివక్ష కేవలం యాజమాన్యాల నుంచే ఎదురవుతుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. స్థానికంగా ఉన్న అనేక పరిస్థితులు ఇలాంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి. వివక్షకు వివిధ వర్గాలు గురవుతున్నప్పటికీ, మహిళల పట్ల వివక్ష మరీ దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం వరకూ లేబర్ మార్కెట్‌లో ఈ వివక్ష కొసాగుతున్నది. స్వయం ఉపాధి పొందుతున్న మహిళల కంటే పురుషులు 2.5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. మగ, ఆడ సాధారణ వేతన కార్మికుల ఆదాయాల మధ్య 95 శాతం వ్యత్యాసానికి ఈ వివక్షే కారణం. లింగ వివక్ష కారణంగా పురుషులు, మహిళల మధ్య ఉపాధి అంతరం 98 శాతం ఉంది. 93 శాతం కేసుల్లో స్త్రీ , పురుషుల సంపాదనలో తేడా రావడానికి కారణం కూడా లింగ వివక్షే. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కంటే గ్రామీణ స్వయం ఉపాధి పురుషులు రెండింతలు సంపాదిస్తున్నారు. జీతాలు తీసుకునే మహిళల్లో వివక్ష కారణంగా 67 శాతం మంది, విద్య, పనిలో అనుభవం లేకపోడంతో 33 శాతం మంది తక్కువ వేతనాలు పొందుతున్నారు. రుణాలు పొందడంలోనూ మహిళలకు అన్యాయమే జరుగుతున్నది. వేతనాల పెంపుదల, నైపుణ్యాలను పెంచడం, ఉద్యో గ రిజర్వేషన్లు, సులభమైన రాబడితో సహా శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను తీసుకుంటే తప్ప పరిస్థితి మెరుగుపడదు.
లేబర్ మార్కెట్‌లో మహిళలపై వివక్ష!
RELATED ARTICLES