ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సంఖ్య, వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం
22లోగా వివరాలు అందించాలని ఆర్థికశాఖ ఆదేశం
2019-20 బడ్జెట్ ప్రతిపాదనలకు లెక్క తేల్చేందుకు సిద్ధం
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రభుత్వ శాఖలలో ఉద్యోగుల సంఖ్య, వారి విరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2019- ఆర్థిక బడ్జెట్ ప్రతిపాదనల నిమిత్తం ఉద్యోగుల లేక్కలు తేల్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. అందులో భాగంగానే ప్రభుత్వంలోని వివిధ శాఖలు, ప్రభు త్వ రంగ సంస్థలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, వారి జీతభత్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని ఆర్థికశాఖ ఆయా శాఖలను ఆదేశించింది. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 22లోగా అన్ని ప్రభుత్వ, అనుబంధ శాఖలు తమ ఉద్యోగుల వివరాలను అందించాలని ఆర్థికశాఖ కోరిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాటికి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య, సూపర్‌న్యూమరీ పోస్టులు, నెల వేతనాలు, స్పెషల్ వేతనం, అలవెన్సుల వివరాలు, అధికారుల సంఖ్య, ఎవరికి ఏ శాఖల పద్దులలో కేటాయింపులు చేశారనే సమగ్ర వివరాలను తెలియజేయాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ సూచించింది. ప్రతి శాఖాధికారి, ఉద్యోగుల సంఖ్య, కొత్తగా మంజూరైన, భర్తీ చేసిన పోస్టులు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దుల కింద వేతనాలు చెల్లిస్తున్న వారి వివరాలను ప్రత్యేకంగా తెలియజేయాలని కోరింది. సంస్థలు, యూనివర్సిటీలకు చెందిన అధికారులు, ఉద్యోగుల వివరాలను, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వివరాలతో సహా సమాచారాన్ని తెలియజేయాలని తెలిపింది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించిన వారి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో తెలియజేయాలని, దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రొఫార్మను కూడా ఆయా శాఖలకు ఆర్థిక శాఖ అందజేసింది.