డేవిస్ కప్‌లో పాక్ చిత్తుచితు.. 3-0 ఆధిక్యంలో భారత్
నూర్-సుల్తాన్: తటస్థ వేదికలో పాకిస్థాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్‌లో భారత జట్టు తన జోరుని కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-0 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్-నెడుంజెళియన్ జోడి 61, 6-3 తేడాతో మహ్మద్ షోయబ్, హఫైజా అబ్దుల్ రెహ్మాన్ జోడీపై నెగ్గింది. వీరిద్దరూ కేవలం 53 నిమిషాల్లో ఆటను ముగించడం విశేషం. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్‌లో లియాండర్ పేస్ జోడీ అద్భుతమైన స్మాష్‌లను సంధించి మ్యాచ్‌లో పైచేయి సాధించింది. చివరకు 6-3 తేడాతో సెట్‌ను గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. డేవిస్‌కప్ డబుల్స్ విభాగంలో 44వ విజయాన్ని అందుకున్నాడు. ఫలితంగా డేవిస్‌కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన రికార్డుని మరింత పదిలం చేసుకున్నాడు. పేస్ తర్వాత స్థానంలో ఇటాలియన్ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు. నికోలా పీట్రెంజెలీ 66 టైల్లో 42 విజయాలు సాధించగా పేస్ కేవలం 56 టైల్లోనే 43 గెలిచాడు. ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్న డబుల్స్ ప్లేయర్లు ఎవరూ టాప్-10లో లేకపోవడం విశేషం. బెలారస్‌కు చెందిన మాక్స్ మిర్నేయి డేవిస్‌కప్‌లో 36 డబుల్స్ విజయాలతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ 2018 నుంచి టోర్నీలో పాల్గొనడం లేదు.
లియాండర్ పేస్ సంచలనం
RELATED ARTICLES