40 మంది మృతి
బెంఘాజి: లిబియాలో జరిగిన వైమానిక బాం బు దాడిలో కనీసం 40 మంది మృత్యువాత పడ్డారు. మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలోని వలసదారుల పునరావాస కే ంద్రంపై బుధవారం ఉదయం ఈ దాడి జరిగింది. మృతుల్లో చాలా మం దిని అఫ్రికా వలసదారులుగా గుర్తించారు. దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. అయితే ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పాలిస్తున్న లిబియన్ నేషనల్ ఆర్మీయే(ఎల్‌ఎన్‌ఎ)ఈ దాడికి పాల్పడిందని ఆ దేశ ప్రధాని ఫయాజ్ అల్ సెర్రా ఆ రోపించారు. లిబియా దేశాధినేత గడాఫీని 20 11లో హతమార్చిన నాటి నుంచి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎల్‌ఎన్‌ఎగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.
లిబియాలో వైమానిక దాడి
RELATED ARTICLES