HomeNewsBreaking Newsలిజ్‌ట్రస్‌ రాజీనామా

లిజ్‌ట్రస్‌ రాజీనామా

బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్‌ చరిత్రలో అతి తక్కువగా, కేవలం 45 రోజులు మాత్రమే ప్రధాని హోదాలో ఉన్న నేత నేతగా ఆమె పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌తో హోరాహోరీగా పోరాడి మరీ దక్కించుకున్న ప్రధాని పద ఆమెకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మాజీ ప్రధాని బొరిస జాన్సన్‌కు కర్జర్వేటివ్‌ పార్టీ మళ్లీ పట్టం కడుతుందా లేక సునాక్‌కు అవకాశం ఇస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నది. ట్రస్‌ సారథ్యంలో గత నెల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ మినీ బడ్జెట్‌ కారంంగానే కుదేలైంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో బ్రిటన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఎవరూ ఊహించని రీతిలో క్వాసి క్వార్టెంగ్‌ను పదవి నుంచి తప్పించిన లిజ్‌, ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్‌ను నియమించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అరవై శాతానికిపైగా కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు లిజ్‌ను ప్రధానిగా ఎన్నుకోవడం ద్వారా పొరపాటు చేశామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో విమర్శలు ఒకవైపు వేధిస్తుండగా, ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి స్యూలా బ్రావెర్మన్‌తోపాటు కొంత మంది క్యాబినెట్‌ సహచరులు కూడా రాజీనామా చేయడంతో ఇరుకున పడిపోయారు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని కార్యాలయంలో గురువారం హడావుడిగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బ్రిటన్‌ మాత్రమేగాక, యావత్‌ ప్రపంచ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించానని ఆమె అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. కానీ, ఆ నిర్ణయాల నేపథ్యంలో, కన్జర్వేటివ్‌ పార్టీ మద్దతు అప్పటి మాదిరిగానే తనకు ఉంటుందని చెప్పలేనని ట్రస్‌ అన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని, కొత్త నేత మార్గదర్శకంలో బ్రిటన్‌ అభివృద్ధి పథంలో నడుస్తుందనే నమ్మకం తనకు ఉందని ట్రస్‌ అన్నారు. కన్జర్వేటివ్‌ టోరీ సభ్యులు కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకూ తాను ప్రధానిగా కొనసాగుతానని ఆమె తన సంక్షిప్త ప్రసంగంలో తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments