రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : కరోనా వైర స్ మహమ్మారిని ఎదుర్కొవడానికి విధించిన లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయడంలో పోలీస్ వ్యవస్థకు సహకరించాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు సామాజిక దూరా న్ని పాటించాలని మరో సారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మానవ సమాజానికి ఒక ఛా లెంజ్ విసురుతున్న ఈ మహమ్మారిని ఓ డించడంలో అందరం భాగస్వాములం అవుదామని డిజిపి మ హేందర్ రెడ్డి గురువారం రాష్ట్ర ప్రజానీకాన్ని కోరారు. కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు ప్రజలు అందిస్తున్న సహకారం మరచి పోలేమన్నారు. ఇకపై కూడా పోలీసులకు ప్రజలు ఇలాగే సహకరించి లాక్‌డౌన్‌ను పాటించాలని డిజిపి మహేందర్ రెడ్డి కోరారు. మన కుటుంబాన్ని , సహచరులను మొత్తం సమాజాన్ని రక్షించడంలో పోలీస్‌శాఖకు రాష్ట్ర ప్రజానీకం అందిస్తున్న సహకారం తమకు ఎంతో గర్వకారణమన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుండి వేరే వారికి సోక కుండా ప్రతి ఒక్క రూ సామాజిక దూరం పాటించేందుకు పోలీస్‌శాఖ సమర్ధవంతంగా పని చేస్తోందన్నారు.
లాక్‌డౌన్ విజయవంతానికి ప్రజలు సహకరించాలి
RELATED ARTICLES