11న ముఖ్యమంత్రులతో చర్చిస్తా
పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా భారత్‌లో మార్చి 24న విధించిన లాక్‌డౌన్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఈనెల 14 తరువాత ఎత్తివేసే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం పార్లమెంట్లో ప్రతిపక్షాలు, ఇతర పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లకు తేల్చి చెప్పా రు. దేశంలో పరిస్థితి సామాజిక అత్యవసర పరిస్థితిని పోలి ఉందని, దాని నుంచి గట్టెక్కేందుకు కఠినమైన నిర్ణయాలు అవసరమన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేందుకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ప్రస్తుతం అప్రమత్తత కచ్చితంగా ఇంకా కొనసాగాలని ప్రధాని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఈనెల 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని రాష్ట్రాలు, జిల్లా అధికార యంత్రాంగాలు, నిఫుణులు సూచిస్తున్నారన్నారు. అఖిలపక్ష పార్టీల ఎంపిలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, దేశంలో వేగం గా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను అదుపు చేసేందుకు ప్రభుత్వం చేపట్టన చర్యలను వారికి వివరించారు. లాక్డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చని ప్రధాని స్పష్టం చేసినట్లు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం బిజు జనతాదళ్ నేత పినాకి మిశ్రా వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాపించిన తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా అన్నట్లుగా ఉంది. సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు రావాల్సి ఉంది మోడీ అన్నట్లు అని పేర్కొన్నారు. ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయలేమని, ఈ విషయంపై సలహాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రులతో చర్చిస్తానని మోడీ చెప్పినట్లు మరో ఎంపి వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిలో రాజ్యసభలో ప్రతిపక్షనేత గులామ్ నబీ ఆజాద్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కూడా ఉన్నారు. వైరస్ కట్టడికి, లాక్డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కేంద్ర వైద్య, హోమ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ) కొరత గురించి సమావేశంలో అనేకమంది ప్రతిపక్ష నాయకులు లేవనెత్తగా, పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపేయాలని మరికొందరు సూచించారని వెల్లడించాయి. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్డౌన్ ఈనెల 14తో ముగియనుండగా, రోజు రోజుకు వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న తరుణంలో ప్రధాని పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మోడీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశమున్నట్లు సంకేతాలిచ్చారు. బుధవారం ఉదయం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దే శంలో మొత్తం 149 మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. మొత్తం 5194 మందికి ఈ వైరస్ సోకింది. కాగా, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆజాద్, పవార్‌తో పాటు రామ్‌గోపాల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్ మిశ్రా (బహుజన్ సమాజ్ పార్టీ), చిరాగ్ పాసవాన్ (లోక్ జన్‌శక్తి పార్టీ), టిఆర్ బాలు (డిఎంకె), సుఖ్బీర్ సింగ్ బాదల్ (శిరోమణీ అకాలీదళ్), రాజీవ్ రంజన్‌సింగ్ (జనతాదళ్ యునైటెడ్), పినాకి మిశ్రా (బి జూ జనతాదళ్), సంజయ్ రౌత్ (శివసేన) సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ నిరాకరించినప్పటికీ అనంతరం ఆ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ హాజరయ్యారు. దేశంలో లాక్డౌన్ విధించిన తరువాత పార్లమెంట్లో ప్రతిపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇదే మొ దటిసారి. ఇంతకు ముందు నాన్ ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలు సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమావేశమయ్యారు. అదే విధంగా కరోనా వైరస్‌కు చెక్‌పెట్టే మార్గాలపై డాక్టర్లు, జర్నస్టులు, పలు స్టాక్‌హోల్డర్లతో సమావేశమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టిఎంసి చీ ఫ్ మమతా బెనర్జీ, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో సహా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో స మావేశమై కరోనా వైరస్ వల్ల తలెత్తుతున్న పరిస్థితు లపై చర్చించారు. ప్రధాని మోడీ మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ము ఖర్జీ, మాజీ ప్రధానులు హెచ్డి దేవెగౌడ, మన్మోహసిన్సింగ్తో కూడా ఫోన్లో మాట్లాడారు.
11న అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఈనెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించడంతోపాటు.. రాష్ట్రాలవారీగా తీసుకున్న చర్యలపై మోడీ సమీక్ష జరపనున్నట్టుగా సమాచారం. అలాగే లాక్డౌన్ పొడిగింపుకు సంబంధించి మో డీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాల ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. క రోనా నియంత్రణ చర్యలకు సంబంధించి ప్ర ధాని మో డీ ఇప్పటికే రెండుసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.