HomeNewsBreaking Newsలాక్‌డౌన్‌కు గుడ్‌బై?

లాక్‌డౌన్‌కు గుడ్‌బై?

20 తర్వాత మరికొన్ని సడలింపులు
సరికొత్త మార్గదర్శకాలు విడుదల
కేంద్ర నిర్ణయాలతో బెంబేలెత్తుతున్న రాష్ట్రాలు

న్యూఢిల్లీ : ఓవైపు దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్‌కు గుడ్‌బై చెప్పే ప్లాన్‌లో వున్నట్లు కన్పిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని ప్రసం గం అనంతరం మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర సర్కారు తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కొన్నాళ్ల పాటు పూర్తి లాక్‌డౌన్‌ను కోరుకుంటున్న రాష్ట్రాలు మాత్రం కేంద్ర నిర్ణయాలతో బెంబేలెత్తుతున్నాయి. కేవలం లాక్‌డౌన్‌ కారణంగానే కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా వుందన్న విషయం అందరికీ తెల్సిందే. ఇప్పుడు సడలింపులు ఇచ్చుకుంటూపోతే రోడ్లపై జనాల సంఖ్య పెరిగిపోతారని, నియంత్రించడం చాలా కష్టంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. వలస కార్మికులను, పేదలను ఆదుకుం టూ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే కరోనా కట్టడి సాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరో నా కేసులు తగ్గుముఖం పట్టడమనేది ఇంకా మొదలుకాలేదు. ఈలోగానే సడలింపులంటే ఎలా అని రాష్ట్రాల పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సమ స్య తెలంగాణకు కూడా వుంది. కేంద్ర సడలింపులు పట్ల మన రాష్ట్ర అధికార వర్గాలు కూడా ఆవేదన చెందినట్లు సమాచారం. ఇదిలావుండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ, దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నుంచి మరికొన్ని ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలో నిర్మాణ  కార్యకలాపాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, దేశ వ్యాప్తంగా ఉన్న కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీల కార్యకలాపాలకు అనమతించింది. మే 3వరకు లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఇప్పటికే పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో దశ లాక్‌డౌన్‌లో ఈనెల 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. అయితే నిబంధనల సడలింపు వైరస్‌ హాట్‌ స్పాట్స్‌కు, కంటైన్మెంట్‌ జోన్స్‌కు వర్తించబోదని  కేంద్రం స్పష్టం చేసింది.  కాగా, శుక్రవారం మరికొన్నింటికి సడలింపులు ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. చిన్న తరహా అటవీ ఉత్పత్తులు ప్రాసెసింగ్‌, సేకరణ, కోతలు, అటవీ ప్రాంతాల్లోని ఇతర అటవీ నివాసితులు, గిరిజనులు ఉత్పత్తి చేస్తున్న కలప కాని అటవీ ఉత్పత్తులకు సడలింపులు ఇవ్వాలని ఆయన సూచించారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం తో ముడిపడి ఉన్న నీటి సరఫరా, శాటిటేషన్‌, విద్యుత్‌ స్థంభాలు, టెలిఫోన్‌ కేబుల్స్‌ తదితర పనులకు అనుమతి. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, కనీస సిబ్బందితో మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు, కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలు సహా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లకు లౌక్‌డౌన్‌ నుంచి సడలింపునివ్వాలన్నారు. వెదురు, కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాల కోత, ప్రాసెసింగ్‌, ప్యాకేజీలు,అమ్మకాలు, మార్కెటింగ్‌కు అనుమతిలు ఇవ్వాలని భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనా వైరస్‌ వి-జృంభణ నేపథ్యంలో మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 14వ తేదీ వరకు దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు మార్చి 24న  ప్రకటించారు. మళ్లీ దానిని మే 3వ తేదీకి పొడిగించారు. అయితే ఈనెల 20 తరువాత వివిధ రంగాల్లో పనులు చేస్తున్న ప్రజలకు, పలు సర్వీసులకు మినహాయింపునివ్వాలని బుధవారం మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments