HomeNewsBreaking Newsలక్ష లోపు రుణాలు మాఫీ

లక్ష లోపు రుణాలు మాఫీ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ రాష్ర్ట రైతాంగానికి మరో తీపికబురు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న ఈ శుభసందర్భంలో రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 99 ,999 వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు 9లక్షల2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకులకు చేరుతాయి. ఇప్పటికే రూ.50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి రూ.1943 .64 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతురుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా రూ. 99, 999 వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి రూ.5809.78 కోట్ల ను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన సిఎం కెసిఆర్‌ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బిఆర్‌ ఒ) కూడా ఇచ్చారు. ఈమేరకు ఆగస్టు 3వ తేదీ నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి.. ఇచ్చిన మాట ప్రకారం, 99వేల 999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ర్టంలో మొత్తంగా 16లక్షల 66వేల 899 మంది రైతులకు లబ్దిచేకూరినట్లవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments