అన్నదాతలను ముంచేసిన అధికారుల నిర్లక్ష్యం
పార్ట్ జాబితాలోనే ఇప్పటికీ లక్షలాది ఎకరాలు
ఇప్పటి వరకు రూ.800 కోట్లు నష్టపోయిన రైతులు
ఈ ఖరీఫ్‌లో రూ.496కోట్ల మేరకు రైతుబంధు సహాయం
హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు నష్టపోతున్నా రు. ఇప్పటి వరకు దాదాపు రూ.800కోట్ల మేర నష్టపోగా, ఈ ఖరీఫ్‌లోనూ దాదాపు రూ.496 కోట్ల మేరకు రైతులు నష్టపోతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించలేదు అన్న చందం గా ప్రభుత్వం కనికరించి పెట్టుబడి సహాయం అందిస్తున్నప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఖరీఫ్ వరకైనా వాటిని సవరించి పెట్టుబడి సహాయం వచ్చేలా చేస్తారేమో అని ఆశపడ్డ సదరు రైతులకు ఇప్పుడు కూడా మొండిచేయే ఎదురైంది. గత కొంత కాలం గా ప్రభుత్వం దశల వారీగా అందిస్తున్న రైతుబంధు సహాయం ఈ సారి వారికి రావడం లేదు. కారణం ఇప్పటికీ వారి భూములను వివాదాస్పద భూములుగానే పరిగణించి పాస్‌బుక్కులు ఇవ్వకపోవడమే. ఇలాంటి రైతులు రాష్ట్రంలో వందలో, వేలో అనుకుంటే ఏమో అనుకోవచ్చు… కానీ ఏకంగా 4,14,584 మంది ఉన్నట్లు రెవెన్యూ అధికారుల ద్వారానే తెలుస్తోంది. వీరికి దాదాపు 9.92లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. అంటే రైతుబంధు కింద వీరికి మొత్తం దాదాపు ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.496 కోట్ల సహాయం అందకుండా పోతోంది. వివారాల్లోకి వెళితే కెసిఆర్ సర్కార్ 2017లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. భూరికార్డుల ఆధారంగా వివాదరహిత భూములకు పాస్‌పుస్తకాలు జారీచేసింది. ఈ రికార్డుల ఆధారంగానే సర్కార్ రైతుబం ధు పథకాన్ని ప్రవేశపెట్టింది. నిజానికి ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ భూములతో వ్యవసాయేతర భూములను పార్డ్ కింద చేర్చారు. వీటితో పాటు వ్యవసాయ భూములకు సంబంధించి అన్నదమ్ముల మధ్య భూ పంపకాల వివాదాలు, వీటిలోనూ విస్తీర్ణంలో కూడా స్వల్ప తేడాను వారు చెప్పినా వాటిని కూడా పార్డ్ కిందనే చేర్చారు. భూములకు అటు, ఇటు పక్కన ఉన్న వారు ఏ చిన్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటిని కూడా పార్డ్ కింద చేర్చారు. ఇలా పార్డ్ బి కింద చేర్చిన వాటికి అప్పట్లో పాస్‌బుక్‌లు జారీ చేయలేదు. అయితే ఇలాంటి వాటిని రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించి వారికి పాస్‌బుక్‌లు ఇవ్వాలి. పాస్ బుక్‌లు లేకపోతే రైతుబంధు పథకమే కాదు, చివరకు పంటరుణాలు, భూములపై బ్యాంకుల్లో ఇతరత్ర రుణా లు, ఏదైనా అత్యవసరమైతే విక్రయించుకోవడం వంటివి కూడా చేసుకోలేని పరిస్థితి. ఇలా ంటి రైతులు రాష్ట్రంలో 4,14,584 మంది రైతులు, వారికి దాదాపు 9,92,295 ఎకరాల భూమి ఉం ది. వీటికి రెవెన్యూ అధికారులు పాస్‌బుక్‌లు ఇవ్వలేదు. దీంతో రైతుబంధు ప్రవేశపెట్టినప్పటి నుంచి వారు ప్రతి ఏటా నష్టపోతూనే ఉన్నారు. మొదట్లో రైతుబంధు కింద ఎకరానికి ఒక్కో విడత లో ఎకరానికి రూ.నాలుగు వేలు పెట్టుబడి సహా యం ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు రెండు సార్లు ఇవ్వగా ఒక్కో విడతకు దాదాపు రూ. 400కోట్లు నష్టపోగా ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ సహాయాన్ని ఎకరానికి రూ.5వేలకు పెంచి ఇస్తున్నారు. ఈ సహాయం కూడా తొలి విడత ఖరీఫ్ సహాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయడం ప్రారంభించింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున లెక్కించుకుంటే ఈ ఖరీఫ్‌లో వారికి అందాల్సిన సహాయం దాదాపు 496కోట్ల రూపాయలు.ఇంత పెద్ద మొత్తంలో రైతులకు నష్టం వాటిల్లుతున్నా…సదరు రైతులు పాస్‌పుస్తకాల కోసం తహసిల్దార్ల చుట్టు తిరుగుతు న్నా.. ఇప్పటికి వారిని అధికారులు కనుకరించ డం లేదు. ఆగ్రహం వెల్ల గక్కితే నెపాన్ని తహసిల్దా ర్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఆ తప్పును ప్రభుత్వంపై నెట్టుతున్నారు. కారణం ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టి దాని ద్వారానే అన్ని నిర్వహిస్తున్నారు. ఒక సారి ఈ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత వాటిని మార్చాలంటే ఎడిట్ ఆప్షన్ ఉం డాలి. అయితే ఈ ఆప్షన్‌ను తహసిల్దార్లకు ఇవ్వలే దు. దీంతో ఒక సారి వారు పార్డ్ కింద నమో దు చేసిన వారివి సవరించి తిరిగి వారికి పాస్‌పుస్తకాలు జారీ చేయలేకపోతున్నామంటున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
లక్షలాది మంది రైతులకు శాపం!
RELATED ARTICLES